ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: చెప్పులు ఆర్డర్ చేసిన యువతికి షాక్.. వస్తువు వచ్చింది కానీ.. తీక్షణంగా పరిశీలించగా..

ABN, Publish Date - Dec 13 , 2024 | 01:28 PM

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్‌ ఆర్డర్లు పెరిగిపోయాయి. ఏది కొనాలన్నా, ఇంకేది తినాలన్నా స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో వాటిని ఇంటికే రప్పించేస్తున్నారు. ఈ సౌలభ్యం బాగానే ఉన్నా కొన్నిసార్లు ఇందులోనూ అనేక కష్టనష్టాలు ఎదురవుతుంటాయి. వస్తువులు సరఫరా చేయడంలో డెలివరీ బాయ్‌లకు ఇబ్బందులు తలెత్తుతుంటే.. మరికొన్నిసార్లు ..

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్‌ ఆర్డర్లు పెరిగిపోయాయి. ఏది కొనాలన్నా, ఇంకేది తినాలన్నా స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో వాటిని ఇంటికే రప్పించేస్తున్నారు. ఈ సౌలభ్యం బాగానే ఉన్నా కొన్నిసార్లు ఇందులోనూ అనేక కష్టనష్టాలు ఎదురవుతుంటాయి. వస్తువులు సరఫరా చేయడంలో డెలివరీ బాయ్‌లకు ఇబ్బందులు తలెత్తుతుంటే.. మరికొన్నిసార్లు ఆర్డర్ చేసిన కస్టమర్లకు వింత వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఆన్‌లైన్‌లో చెప్పులు ఆర్డర్ చేసిన ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) ఆన్‌లైన్‌లో చెప్పులు ఆర్డర్ చేసింది. గంటల వ్యవధిలో ఆర్డర్ చేసిన చెప్పులు కూడా వచ్చేశాయి. డెలివరీ బాయ్ డోర్ కొట్టి ఆమె ఆర్డర్ (Online order) చేసిన చెప్పుల బాక్స్‌ను అందించి వెళ్లాడు. బాక్స్ తెరచిన యువతి.. అందులోని చెప్పులను (sandals) బయటికి తీసింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Viral Video: తెలిసి తప్పు చేయడమంటే ఇదే.. రైలు వేలాడుతున్న యువతి.. చూస్తుండగానే..


తాను ఆర్డర్ చేసిన చెప్పుల కంపెనీ పేరు బాక్స్‌పై, చెప్పులపై ఉంది. కానీ చెప్పులపై ఉన్న పేరు చూడగానే ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో దాన్ని తీక్షణంగా పరిశీలించగా.. అక్కడ స్టిక్కర్ అంటించారని గుర్తించింది. చివరకు ఆ స్టిక్కర్‌ను తీసేయగా.. దాని కింద వేరే పేరు బయటపడింది. తాను ఆర్డర్ చేసిన కంపెనీ చెప్పులు కాకుండా వేరే కొత్త కంపెనీకి చెందిన చెప్పుల రావడం చూసి ఆమె షాక్ అయింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: వయసు మీదపడుతున్నా బుద్ధి మారలేదు.. యువతి పక్కన డాన్స్ చేస్తున్న వృద్ధుడి నిర్వాకం చూస్తే..


అయితే వీడియో చూసిన చాలా మంది.. ఇది ఫేక్ అని చెబుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బాక్స్ ఓపెన్ చేయగానే అంతా తెలిసినట్లు చూపిస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఆన్‌లైన్‌లో ఇలాంటి మోసాల పట్లు జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30 వేలకు పైగా లైక్‌లు, 6.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical Illusion Personality Test: మీరు కూర్చునే భంగిమ.. మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 13 , 2024 | 01:28 PM