ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: హోటల్లో ఒంటరిగా కేక్ తింటున్న యువకుడు.. సైలెంట్‌గా దగ్గరికి వచ్చిన యువతులు.. చివరికి..

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:51 AM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని అయ్యో.. పాపం.. అనేలా ఉంటాయి. అలాగే ఇంకొన్ని వీడియోలు తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని అయ్యో.. పాపం.. అనేలా ఉంటాయి. అలాగే ఇంకొన్ని వీడియోలు తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి హాటల్లో ఒంటరిగా కూర్చుని కేక్ కట్ చేసుకుని తింటుంటాడు. అయితే సైలెంట్‌గా అక్కడికి ఎంటరైన హోటల్ మహిళా సిబ్బంది.. చివరికి చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా హోటల్ సిబ్బందిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తి కేక్ పీస్ ఆర్డర్ చేస్తాడు. ఇంతలో ఓ యువతి ప్లేట్‌లో కేక్‌ను తీసుకొచ్చి అతడి టేబుల్‌పై పెడుతుంది. ఆ తర్వాత అతను తన స్నేహితులకు వీడియో కాల్ చేసి, వాళ్ల సమక్షంలో ఆ చిన్న కేక్‌పైనే కొవ్వొత్తి పెట్టి వెలిగిస్తాడు. ఆ తర్వాత స్నేహితులంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుండగా.. కొవ్వొత్తిని ఆర్పేసి (Birthday cake cutting) కేక్ కట్ చేస్తాడు. ఫైనల్‌గా ఆ కేక్ ముక్కను అతనొక్కడే కట్ చేసుకుని తింటుంటాడు.

Viral Video: కష్టపడి నది దాటుకుని వెళ్లిన వృద్ధులు.. చివరకు అసలు కారణం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..


అయితే ఇదంతా మొదటి నుంచి గమనిస్తున్న హోటల్ మహిళా సిబ్బంది చివరకు ఓ నిర్ణయం తీసుకుంటారు. యువతులు (young women) అంతా కలిసి ఓ పెద్ద కేక్‌ను తీసుకుని సడన్‌గా అతడి వద్దకు వస్తారు. అందరి సమక్షంలో అతడితో కేక్ కట్ చేయించి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. వాళ్లు చేసిన ఈ పనికి అతడు ఎంతో సంతోషిస్తాడు. వాళ్లందరినీ కౌగిలించుకుని థ్యాంక్స్ చెబుతాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: సైకిల్‌ను చోరీ చేసి, గేటు దూకి పోరిపోతున్న దొంగ.. సడన్‌గా పొడవాటి వ్యక్తి ఎంట్రీ.. చివరకు..


ఇలా హోటల్ సిబ్బంది అంతా కలిసి ఆ యువకుడికి ఇలా వినూత్నంగా పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా.. చాలా బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘హోటల్ సిబ్బంది చాలా గొప్ప పని చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం కోటికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 21 , 2024 | 11:52 AM