ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఈత కొట్టేందుకు బావిలోకి వెళ్లగా.. కదలకుండా పడి ఉన్న పాము.. ఏమైందబ్బా..! అని దగ్గరికి వెళ్లి చూడగా..

ABN, Publish Date - Feb 20 , 2024 | 04:09 PM

ఇంటా, బయటా అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పాములు కనపడుతూ అందరినీ షాక్‌కి గురి చేస్తుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తలుపులు తీయబోతే మీదకు వచ్చి బుసలు కొట్టడం చూశాం, మంచంపై..

ఇంటా, బయటా అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పాములు కనపడుతూ అందరినీ షాక్‌కి గురి చేస్తుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తలుపులు తీయబోతే మీదకు వచ్చి బుసలు కొట్టడం చూశాం, మంచంపై పడుకుందామని చూస్తే.. పరుపు కింద నుంచి సడన్‌గా బయటికి వచ్చిన పాములను చూశాం, ఫ్యాన్ పైనుంచి పడగ విప్పిన పాములను కూడా చూశాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడయాలో తెగ వైరల్ అవుతోంది. ఈత ఆడేందుకు బావిలోకి వెళ్లగా.. ఓ పాము కదలకుండా పడి ఉంది. ఏమైందబ్బా..! అని దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు ఈత కొట్టేందుకు పొలాల్లో ఉన్న ఓ బావి (well) వద్దకు వెళ్లారు. తీరా బావిలోకి దూకే సమయంలో వారికి నీళ్లపై ఏదో అనుమానాస్పదంగా కనిపించింది. తేరిపారా చూస్తే ఓ పాము చలనం లేకుండా పడి ఉంది. అంతా అది చనిపోయిందని భావించారు. అయినా పట్టుకోవడానికి భయపడి.. స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ (snake catcher) .. పాము వద్దకు వెళ్లి పరిశీలించాడు. అతను ఇలా పట్టుకోగానే.. పాము వెంటనే బుసలు కొడుతూ కాటు వేసేందుకు ప్రయత్నించింది.

Viral Video: వామ్మో! ఈమేంటీ.. సిగరెట్ అడిగితే ఇవ్వలేదనే కోపంతో.. చివరకు మరీ ఇలా చేసిందేంటీ..

అయినా అతను భయపడకుండా పట్టుకుని పైకి ఎత్తగా.. ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో చాలాసార్లు అతన్ని కాటు వేసేందుకు ప్రయత్నించింది. అయినా అతను పాము కాటు నుంచి తెలివిగా తప్పించుకుంటూ.. దాన్ని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈ పాము చనిపోయినట్లు బాగా నటించిందిగా’’.. అంటూ కొందరు, ‘‘బావుల్లో ఈత ఆడే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గేమ్ ఛేంజర్... క్రికెట్ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ మొదలెట్టిన ఎద్దు.. చివరికి ఏమైందంటే..

Updated Date - Feb 20 , 2024 | 04:32 PM

Advertising
Advertising