ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: యూట్యూబర్.. ఎంత పని చేశావ్.. నోయిడా టవర్ ఎక్కి..

ABN, Publish Date - Jul 01 , 2024 | 02:30 PM

ఆ యూట్యూబర్ పేరు నీలేశ్వర్. అతని వయసు 22 సంవత్సరాలు. యూట్యూబ్‌లో అతనికి 8.87 వేల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అయితే.. ఈమధ్య ఎన్ని వీడియోలు వేస్తున్న వ్యూస్ గానీ, సబ్‌స్క్రైబర్స్ గానీ పెరగట్లేదు.

Youtuber Nileshwar

సోషల్ మీడియా (Social Media) పుణ్యమా అని.. ఈరోజుల్లో చాలామంది రాత్రికిరాత్రే పాపులారిటీ గడిస్తున్నారు. తాము చేసే వింత పనుల కారణంగా వీడియోలు వైరల్ అవ్వడం, ఫలితంగా వారికి ఫేమ్ రావడం జరుగుతోంది. ఈ ఫేమ్ కోసం కొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ రిస్కీ స్టంట్స్ చేస్తుంటారు. లేటెస్ట్‌గా ఓ యూట్యూబర్ కూడా అదే పని చేశాడు. పాపులారిటీ గడించాలన్న ఉద్దేశంతో.. అత్యంత ప్రమాదకరమైన స్టంట్ చేసి, ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి.. అతనిని కాపాడారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


ఆ యూట్యూబర్ పేరు నీలేశ్వర్. అతని వయసు 22 సంవత్సరాలు. యూట్యూబ్‌లో అతనికి 8.87 వేల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అయితే.. ఈమధ్య ఎన్ని వీడియోలు వేస్తున్న వ్యూస్ గానీ, సబ్‌స్క్రైబర్స్ గానీ పెరగట్లేదు. దీంతో.. ఏదైనా డేంజరస్ స్టంట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడి సహకారంతో.. నోయిడాలోని తిగ్రి గ్రామంలో ఉన్న ఎత్తైన టవర్‌పై ఎక్కాలని ప్లాన్ చేశాడు. అనుకున్నదే తడువుగా.. అతను టవర్ ఎక్కడం మొదలుపెట్టాడు. అతని స్నేహితుడు కిందనే ఉండి.. అతని స్టంట్‌ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాడు. ఇది గమనించిన స్థానికులు ఒక్కొక్కొరుగా అక్కడికి చేరుకోవడం మొదలుపెట్టారు. జనాలు గుంపులుగా రావడం చూసి.. స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు.


మరోవైపు.. ఆ టవర్ ఎక్కిన నీలేశ్వర్ మాత్రం పైనే చిక్కుకుపోయాడు. కిందకు ఎలా దిగాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అప్పుడు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు రంగంలోకి దిగారు. అతనిని కిందకు దించేందుకు పెను సవాళ్లే ఎదుర్కున్నారు. ఎట్టకేలకు.. ఐదు గంటల పాటు కష్టపడి, నీలేశ్వర్‌ని కిందకు తీసుకొచ్చారు. పాపులారిటీ పొందాలన్న ఉద్దేశంతోనే తాను ఆ టవర్ ఎక్కానని అతను చెప్పిన సమాధానం విని.. అధికారులు నోరెళ్లబెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. ఫేమ్ కోసం ఇలాంటి భయంకరమైన స్టంట్స్ చేయొద్దని ఇతర ఇన్‌ఫ్లుయెన్సర్లను సూచించారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jul 01 , 2024 | 02:30 PM

Advertising
Advertising