మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: పారాగ్లైడింగ్ చేస్తుండగా మధ్యలో షాకింగ్ ట్విస్ట్.. అతడి ఫోన్‪‌లో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తే..

ABN, Publish Date - Apr 30 , 2024 | 09:37 PM

పారాగ్లైడింగ్ అంటేనే ఓ వింత అనుభూతి. గాల్లోకి దూసుకెళ్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పక్షిలా విహరించడం ఎంతో మధురానుభూతి. అయితే ఇది చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో.. కొన్నిసార్లు అంతే భయంకరంగా కూడా మారుతుంటుంది. పారాగ్లైడింగ్ చేస్తూ ...

Viral Video: పారాగ్లైడింగ్ చేస్తుండగా మధ్యలో షాకింగ్ ట్విస్ట్.. అతడి ఫోన్‪‌లో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తే..

పారాగ్లైడింగ్ అంటేనే ఓ వింత అనుభూతి. గాల్లోకి దూసుకెళ్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పక్షిలా విహరించడం ఎంతో మధురానుభూతి. అయితే ఇది చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో.. కొన్నిసార్లు అంతే భయంకరంగా కూడా మారుతుంటుంది. పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడ్డ ఎంతో మందిని చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తుండగా మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అమెరికా (America) పరిధి ఆరిజోనాలోని ఎన్‌చాన్టెడ్ రాక్ స్టేట్ పార్క్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఆంథోనీ అనే యూట్యూబర్.. పారాగ్లైడింగ్ (Paragliding) చేస్తూ ఆ వీడియోలను తన చానెల్‌లో షేర్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇటీవల రోజూలాగే BGD లూనా-3 అనే విమానాన్ని పరీక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో అతను ఎన్‌చాన్టెడ్ రాక్ స్టేట్ పార్క్ పైన ఆకాశంలో 100 అడుగుల ఎత్తులో విహరిస్తున్నాడు.

Viral Video: పడవలో వెళ్తున్న మత్య్సకారుడికి షాకింగ్ అనుభవం.. నీటిలో నుంచి పడవలోకి వచ్చిన వింత జీవి.. చివరకు..


అయితే ఆకాశంలో ఉండగా ఉన్నట్టుండి విమానం రోప్ తెగిపోతుంది. దీంతో ఒక్కసారిగా అదుపుతప్పిన పారాగ్లైడర్.. 50ఎంపీహెచ్ వేగంతో నేలపైకి దూసుకొచ్చి ధబేల్‌మని పడిపోతాడు. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడతాడు. నొప్పిని తాళలేక రక్షించండి.. రక్షించండి.. అంటూ అరుపులు, కేకలు పెడతాడు. చివరకు అతి కష్టం మీద తన ఫోన్ నుంచి అత్యవసర వైద్యసాయం కోసం 911 నంబర్‌కి కాల్ చేసి, తన పరిస్థితిని తెలియజేస్తాడు. దీంతో ఎట్టకేలకు అతను ప్రాణాపాయం నుంచి బయటపడతాడు.

Viral Video: కొండచిలువను చుట్టిముట్టిన ముంగిసల మంద.. భీకర పోరులో చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..


చాలా ఎత్తు నుంచి కిందపడడం వల్ల అతడి మెడ, కుడి చేయి విరిగిందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ప్రమాద ఘటన మొత్తం అతడి వద్ద ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘పారాగ్లైడింగ్ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. పాపం..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వారి మానాన వారుంటే అనవసరంగా గెలికారు.. చివరకు వరుడి ప్రవర్తన చూసి బిత్తరపోయిన వధువు..

Updated Date - Apr 30 , 2024 | 09:42 PM

Advertising
Advertising