ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ashwin: ధోనీ, కోహ్లీ, రోహిత్.. ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ అతడే.. అశ్విన్ చెప్పిన సమాధానం ఏంటంటే..

ABN, Publish Date - Sep 03 , 2024 | 07:01 PM

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ అయ్యాక టీమిండియా స్వరూపమే మారిపోయింది. అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ టీమ్‌గా ఎదిగింది. 2007, 2011 ప్రపంచకప్‌లు, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు సాధించింది. అలాగే టెస్ట్ ఫార్మాట్‌లోనూ మెరుగ్గా ఆడింది. ఆ తర్వాత ధోనీ నుంచి కోహ్లీ పగ్గాలు అందుకున్నాడు.

MS Dhoni, Virat Kohli, Rohit Sharma

మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కెప్టెన్ అయ్యాక టీమిండియా స్వరూపమే మారిపోయింది. అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ టీమ్‌గా ఎదిగింది. 2007, 2011 ప్రపంచకప్‌లు, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు సాధించింది. అలాగే టెస్ట్ ఫార్మాట్‌లోనూ మెరుగ్గా ఆడింది. ఆ తర్వాత ధోనీ నుంచి కోహ్లీ (Virat Kohli) పగ్గాలు అందుకున్నాడు. టెస్ట్‌ల్లోనూ నెంబర్ వన్ స్థానానికి చేర్చాడు. మరిన్ని విజయాలు అందించాడు. ఆ తర్వాత రోహిత్ (Rohit Sharma) సారథిగా మారాడు. రోహిత్ సారథ్యంలో వన్డేలు, టీ20ల్లో టీమిండియా మరపురాని విజయాలు సాధించింది. 2024 టీ20 ప్రపంచకప్ చేజిక్కించుకుంది.


టీమిండియాకు నాయకత్వం వహించిన ఈ ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ (Best Captain) ఎవరు అంటే చెప్పడం కాస్త కష్టమే. ఈ ప్రశ్నకు స్పిన్నర్ ఆశ్విన్ (Ashwin) తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన అశ్విన్.. ఈ ముగ్గురిలో రోహిత్ బెస్ట్ కెప్టెన్ అని చెప్పాడు. అందుకు గల కారణాలను కూడా వివరించాడు. కెప్టెన్సీ పరంగా ధోని లేదా కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ స్పెషల్ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా అతని అప్రోచ్ బాగుంటుందన్నాడు. జట్టు వాతావరణాన్ని లైట్‌గా ఉంచడానికి రోహిత్ ప్రయత్నిస్తాడని చెప్పాడు. వ్యూహాల విషయంలో ధోనీ, కోహ్లీ కంటే రోహిత్ సీరియస్‌గా ఆలోచిస్తాడని తెలిపాడు.


``గేమ్ ప్లాన్ విషయంలో చాలా రోహిత్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. ధోనీ, విరాట్ కోహ్లీతో పోలిస్తే వ్యూహాలపై రోహిత్ ఎక్కువగా పనిచేస్తాడు. ఏదైనా పెద్ద మ్యాచ్ లేదా సిరీస్ ఉంటే, రోహిత్ శర్మ ఎనలిటిక్స్ టీమ్, కోచ్‌తో కూర్చుని చర్చిస్తాడు. ప్రత్యర్థి బ్యాటర్, బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలో చక్కగా విశ్లేషించుకుంటాడు. ఇక, ఒక ఆటగాడు తుది జట్టులోకి ఎంపికయ్యాడంటే అతడికి వంద శాతం మద్దతుగా నిలుస్తాడు. ఇతర ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపడంలో రోహిత్‌ది గొప్ప స్ట్రాటజీ`` అని అశ్విన్ అన్నాడు.

ఇవి కూడా చదవండి..

Harbhajan Singh: పదివేల పరుగులు నువ్వు చేయలేకపోతే సిగ్గుపడాలి.. కోహ్లీతో హర్భజన్ ఏమన్నాడంటే..


రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా..


త్వరలో రిటైర్మెంట్‌పై నిర్ణయం : సైనా నెహ్వాల్‌


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 03 , 2024 | 07:01 PM

Advertising
Advertising