IPL 2024: సెంచరీ చేసినా.. బ్యాట్ పైకి లేపలేదు.. రోహిత్‌పై బ్రెట్ లీ ప్రశంసలు
ABN, Publish Date - Apr 15 , 2024 | 08:54 PM
హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ప్రశంసలు కురిపించారు. నిన్నటి మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పటికీ.. కనీసం బ్యాట్ పైకి లేపలేదని గుర్తుచేశారు. తన వ్యక్తిగత రికార్డుల కన్నా.. జట్టు ప్రయోజనాలు ముఖ్యమని భావించారని లీ పేర్కొన్నారు.
ఐపీఎల్ సీజన్‌లో ముంబై జట్టు కేవలం ఒక్క విజయాన్నే నమోదు చేసింది. రోహిత్ శర్మను (Rohit Sharma) కెప్టెన్సీ నుంచి తప్పించడం.. పాండ్యాకు బాధ్యతలు ఇవ్వడంతో ఆ జట్టు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. చెన్నై బ్యాట్స్ మెన్ వీరవీహార్ చేసిన సంగతి తెలిసిందే. 207 పరుగుల లక్ష్యంతో ముంబై జట్టు బ్యాటింగ్‌కు దిగింది. సెకండ్ ఎండ్ నుంచి రోహిత్‌కు ఒక్కరు సరిగ్గా స్టాండ్ ఇవ్వలేదు. అయినప్పటికీ రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు. దూకుడుగా ఆడాడు. అలానే సెంచరీ కూడా పూర్తి చేశాడు. సెంచరీ చేసిన ఫలితం లేదు. ఎందుకంటే మ్యాచ్ గెలవలేదు. అందుకే రోహిత్ శర్మ బ్యాట్ పైకి ఎత్తలేదు. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ పేస్ బ్రెట్ లీ ప్రస్తావించారు.
IPL 2024: హ్యాట్రిక్ సిక్సులు బాదిన ధోని.. అభిమానుల కేరింతలతో హోరెత్తిన స్టేడియం
పతీరణ బౌలింగ్‌లో ఫోర్ కొట్టడంతో రోహిత్ సెంచరీ చేశాడు. తక్కువ మంది రియాక్ట్ అయ్యారు. ముంబై కా రాజా అని కొందరు అన్నారు. మరికొందరు చప్పట్లు కొట్టారు. రోహిత్ మాత్రం ఏమి పట్టించుకోలేదు. కనీసం బ్యాట్ కూడా పైకి ఎత్తలేదు. స్ట్రైక్‌కి వెళ్లే ముందు మరో స్ట్రైకర్ నబీతో మాట్లాడారు. తన వ్యక్తిగత రికార్డు కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావించారు. రోహిత్ చర్యను ఆస్ట్రేలియా పేసర్ బ్రెట్ లీ ప్రశంసలతో ముంచెత్తారు.
రోహిత్ అద్భుతైమన సెంచరీ చేశాడు. సెంచరీ చేసినప్పటికీ అతని మొహంలో ఏ మాత్రం ఆనందం లేదు. జట్టు కోసం, విజయం కోసమే ప్రతి బంతిని ఆడాడు. రోహిత్ ఆ చర్య తనను ఇంప్రెస్ చేసింది. మైదానంలో అన్ని వైపులా బంతిని తరలించాడు. 63 బంతుల్లో 105 పరుగులు చేశాడు. 5 సిక్సులు, 11 ఫోర్లతో చెలరేగాడు. ఆ సిక్సులలో కొన్ని ఇతర స్టేడియాల్లో అయితే గ్రౌండ్ బయట పడేవి. కానీ జట్టు గెలవకపోవడం రోహిత్‌ను బాధించి ఉండొచ్చు అని’ బ్రెట్ లీ అన్నారు.
Hardik Pandya: చెత్త కెప్టెన్సీ.. చెత్త బౌలింగ్.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై దారుణ ట్రోలింగ్!
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం
Updated Date - Apr 15 , 2024 | 08:54 PM