ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chris Gayle: టీమిండియా బెస్ట్ కెప్టెన్ అతడే.. కఠినమైన బౌలర్ ఇప్పటివరకు పుట్టలేదు.. క్రిస్ గేల్ వ్యాఖ్యలు..

ABN, Publish Date - Oct 06 , 2024 | 08:51 PM

సచిన్, ద్రవిడ్ వంటి దిగ్గజాలు కూడా కెప్టెన్లుగా విఫలమయ్యారు. ఆ తర్వాతి తరంలో ధోనీ, కోహ్లీ, రోహిత్ మాత్రం టీమిండియా సారథులుగా తమదైన ముద్ర వేశారు. అయితే ఈ ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరనే చర్చ ఇటీవలి కాలంలో జోరుగా సాగుతోంది. ఈ ప్రశ్నకు విండీస్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.

Chris Gayle

ఆటగాడిగా మంచి మార్కులు సాధించినా, ఓ నాయకుడిగా (Captain) జట్టును ముందుండి నడిపించడం అంత సులభం కాదు. కొన్ని కోట్ల మంది ఆశలను మోస్తూ జట్టును విజయవంతంగా నిలపడం అందరికీ సాధ్యం కాదు. అందుకే సచిన్, ద్రవిడ్ వంటి దిగ్గజాలు కూడా కెప్టెన్లుగా విఫలమయ్యారు. ఆ తర్వాతి తరంలో ధోనీ (MS Dhoni), కోహ్లీ (Virat Kohli), రోహిత్ (Rohit Sharma) మాత్రం టీమిండియా సారథులుగా తమదైన ముద్ర వేశారు. అయితే ఈ ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ (Best Captain) ఎవరనే చర్చ ఇటీవలి కాలంలో జోరుగా సాగుతోంది. ఈ ప్రశ్నకు విండీస్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ (Chris Gayle) తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.


``నా దృష్టిలో టీమిండియా బెస్ట్ కెప్టెన్ అంటే ధోనీ పేరే చెబుతా. అతడు ట్రెండ్ సెట్టర్. అతడి నాయకత్వంలో టీమిండియా పటిష్టంగా తయారైంది. ఉత్తమ జట్లలో ఒకటిగా ఎదిగింది. టీమిండియాకు మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ధోనీ. కెప్టెన్సీ పరంగా ఓ ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ కూడా నాయకుడిగా మరపురాని విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కూడా నాయకుడిగా టీమిండియాను విజయపథాన నడుపుతున్నాడ``ని గేల్ అన్నాడు. ధోనీ సారథ్యంలో టీమిండియా మూడు ఐసీసీ ట్రోఫీలనూ సాధించిన సంగతి తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను ధోనీ సారథ్యంలోని టీమిండియా దక్కించుకుంది.


తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ ఎవరు అనే ప్రశ్నకు గేల్ తనదైన శైలిలో ఆసక్తికర సమాధానం చెప్పాడు. ``అసలు కఠినమైన బౌలర్ పుట్టాడా? పుట్టినా అతడు ఇంకా బతికే ఉన్నాడా? నిజానికి బౌలర్లందరూ కఠినంగానే ఉంటారు. అందరూ వికెట్ తీయాలనే ప్రయత్నంలోనే ఉంటారు. అయితే కొందరు నాణ్యమైన ఫాస్ట్‌బౌలర్లు, స్పిన్నర్ల బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగడం సరదాగా ఉంటుంది. ప్రతి బౌలర్ కఠినంగానే ఉంటాడు. కానీ, యూనివర్సల్ బాస్ మరింత కఠినంగా ఉంటాడు`` అంటూ గేల్ సమాధానం చెప్పాడు.

ఇవి కూడా చదవండి..

India vs Pakistan: పాకిస్తాన్‌పై ఉమెన్స్ టీమిండియా గ్రాండ్ విక్టరీ..సెమీస్ ఆశలు సజీవం


27 ఏళ్ల తర్వాత.. ఇరానీ విజేత ముంబై


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 06 , 2024 | 08:51 PM