ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో వివాదం.. పిల్లలతో పెర్ఫార్మెన్స్, యేసు రూపంతో ఏకంగా..

ABN, Publish Date - Jul 27 , 2024 | 12:18 PM

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 33వ సమ్మర్ ఒలింపిక్ క్రీడలు(Paris Olympics 2024) అధికారికంగా గత రాత్రి ప్రారంభమయ్యాయి. కానీ ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు మాత్రం ప్రస్తుతం వివాదానికి దారి తీశాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Controversy in Paris Olympics 2024

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 33వ సమ్మర్ ఒలింపిక్ క్రీడలు(Paris Olympics 2024) అధికారికంగా గత రాత్రి ప్రారంభమయ్యాయి. దీంతో లండన్ తర్వాత మూడుసార్లు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన రెండో నగరంగా పారిస్ నిలిచింది. పారిస్ గతంలో 1900, 1924లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించింది. 100 ఏళ్ల విరామం తర్వాత పారిస్‌లో ఒలింపిక్ క్రీడలు తిరిగి వచ్చాయి. ఒక శతాబ్దం తర్వాత ఈ సందర్భాన్ని చిరస్మరణీయంగా మార్చడానికి ఫ్రాన్స్ ఏ అవకాశాన్ని వృథా చేయలేదు. కానీ ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు మాత్రం ప్రస్తుతం వివాదానికి దారి తీశాయి.


కాథలిక్కులకు అవమానం

వాటిలో డ్రాగ్ క్వీన్స్‌చే "ది లాస్ట్ సప్పర్(the Last Supper)"ని పునఃసృష్టి చేయడంతో సహా కొన్ని ప్రదర్శనలు వివాదాస్పదమయ్యాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రతిష్టాత్మక క్రీడా వేడుకల్లో ఇలాంటి ప్రదర్శనలు చేయడం సరికాదని నెటిజన్లు అంటున్నారు. ఆ క్రమంలోనే ఒలంపిక్స్ ఈ రాత్రి చనిపోయిందని సోషల్ మీడియా(social media)లో ఈవెంట్ ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ విమర్శలు చేస్తున్నారు. యేసు మాదిరిగా వేషదారణలో ఉన్న ఓ వ్యక్తి అసభ్యంగా నృత్యం చేసిన వీడియో విమర్శలకు దారి తీసింది. దీంతో క్రిస్టియన్లు ఈ అంశంపై తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. దేవుడి విషయంలో ఇలా చేయడమెంటని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. క్రైస్తవ విశ్వాసాన్ని దెయ్యాల మాదిరిగా అపహాస్యం చేయడం బాలేదని మరికొంత మంది అంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్కులకు అవమానం జరిగిందని చెబుతున్నారు.


గడ్డం లేడీ

మరో వీడియోలో ప్రారంభ వేడుకలో మేరీ ఆంటోయినెట్ శిరచ్ఛేదం దృశ్యం కూడా ఉంది. ఇది 16 అక్టోబర్ 1793న గిలెటిన్ ద్వారా ఆమెను ఉరితీసిన నాటిది. దీంతోపాటు గడ్డం ఉన్న "లేడీ" రెచ్చగొట్టే విధంగా డ్యాన్స్ చేసిన వీడియోపై కూడా నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాకుండా మొండెం ఉన్న తలతో పాట పాడించటం వంటి ప్రదర్శనలపై కూడా విమర్శలు వచ్చాయి.


పిల్లలతో కూడా

అంతేకాదు పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో హైపర్ సెక్సువలైజ్డ్ ప్రదర్శనలో చిన్నారులతో ప్రదర్శనలు చేయించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిని నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులతో ప్రదర్శనలు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 1,500 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఒలింపిక్స్ వేడుకల్లో ఇలా చేయడం దారణమని అంటున్నారు. పిల్లలను పావులుగా ఉపయోగించడం పూర్తిగా నీచమైన చర్య అని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు పారిస్ ఒలంపిక్ గేమ్స్ ప్రారంభోత్సవ వేడుకలు చరిత్రలోనే అత్యంత చెత్త ప్రారంభ వేడుకలని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే వీటిని పలువురు ఎంజాయ్ చేస్తుండగా, అనేక మంది మాత్రం విమర్శలు చేయడం విశేషం.


ఇవి కూడా చదవండి:

IND vs SL: నేడు ఇండియా vs శ్రీలంక టీ20 సిరీస్ మ్యాచ్.. ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఉంది


Asia Cup : మన ప్రత్యర్థి మళ్లీ శ్రీలంకే


Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 12:21 PM

Advertising
Advertising
<