ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AB De Villiers: ఆ కాలంపోయింది.. కివీస్ చేతిలో భారత్ ఓటమిపై డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Oct 28 , 2024 | 08:48 AM

న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత ఆతిథ్య జట్టు టీమిండియాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు దిగ్గజ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలపై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది. మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో 12 ఏళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై భారత్‌ టెస్టు సిరీస్‌‌ను చేజార్చుకుంది. దీంతో స్వదేశంలో భారత్ ఆధిపత్యానికి కివీస్ జట్టు చెక్ పెట్టినట్టు అయింది. ఇక్కడి పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని రెండు అద్భుతమైన విజయాలు సాధించారు. ఇక సొంత పిచ్‌లపై దారుణంగా ఓడిన ఆతిథ్య జట్టు టీమిండియాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు దిగ్గజ ఆటగాళ్లపై వ్యక్తమవుతున్న తీవ్ర విమర్శలపై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.


ఓడిపోయిన రెండు మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లలో తప్పేమీ లేదని, వాళ్లు అద్భుతమైన ఆటగాళ్లని ‘మిస్టర్ 360’ సమర్థించాడు. భారత బ్యాటర్లు అందరూ స్పిన్ బాగా ఆడగలరని అన్నాడు. గతంలో స్పిన్ విషయంలో చాలా జట్లు ఇబ్బందిపడ్డాయని డివిలియర్స్ ప్రస్తావించాడు. అయితే భారత పర్యాటనకు వెళ్తే కష్టకాలం ఎదురవుతుందనే భావన ఇప్పుడు లేదని, ఆ కాలం పోయిందని వ్యాఖ్యానించారు.

‘‘1990, 2000ల ఆరంభ రోజులు పోయాయి. ఆ రోజుల్లో పలు కండీషన్లలో బ్యాటర్లు వాకింగ్ వికెట్ల లాగా అనిపించేవారు. విరాట్ కోహ్లీని చూడండి దక్షిణాఫ్రికాలో కూడా సెంచరీలు సాధిస్తున్నాడు’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. తన అభిప్రాయానికి సమర్థించుకుంటూ దక్షిణాఫ్రికా గడ్డపై విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సత్తాను ఉదాహరణగా ప్రస్తావించాడు. ఇక భారత పిచ్‌లపై కొత్త పరిస్థితులకు తగ్గట్టు ఆడడమే పర్యాటక న్యూజిలాండ్ జట్టు విజయానికి కారణమని డివిలియర్స్ పేర్కొన్నాడు.


‘‘భారత్‌లో ఆడినప్పుడు టీమిండియా ఆటగాళ్లు స్పిన్‌లో అత్యుత్తమ ప్లేయర్లు. దానర్థం ప్రపంచంలోని బ్యాటర్లందరూ ఎప్పటికీ స్పిన్‌లో అత్యుత్తమ ప్లేయర్లు కాబోరని కాదు కదా. ఎంత మంచి ఆటగాళ్లైనా ఒత్తిడికి గురవుతారు. బ్యాటర్‌కు నైపుణ్యం, సామర్థ్యం ఉంటే ప్రపంచంలోని ఏ పరిస్థితుల్లోనైనా పరుగులు సాధించవచ్చు’’ అని డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి

విమాన ప్రయాణంలో శునకం మృతి.. యజమాని ఏం చేశాడంటే

ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్ పూర్తి చేసిన బీజేపీ ఎంపీ.. ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే

For more Viral News and Telugu News

Updated Date - Oct 28 , 2024 | 08:58 AM