SRH vs PBKS: రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ.. సనరైజర్స్ హైదరాబాద్ చరిత్రలోనే..
ABN, Publish Date - Apr 09 , 2024 | 08:41 PM
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 2 ఫోర్లు, ఒక సిక్సుతో 11 బంతుల్లో అభిషేక్ శర్మ 16 పరుగులు చేశాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 1,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు.
చండీఘడ్: ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 2 ఫోర్లు, ఒక సిక్సుతో 11 బంతుల్లో అభిషేక్ శర్మ 16 పరుగులు చేశాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 1,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) చరిత్రలో 1,000 పరుగులు చేసిన పూర్తి చేసిన మొదటి ఆన్‌క్యాప్‌డ్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాదే కాకుండా డెక్కన్ చార్జర్స్ లేదా హైదరాబాద్ బేస్‌డ్ ఫ్రాంచైజీ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. హైదరాబాద్ తరఫున 49 ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ శర్మ ఈ ఘనత సాధించాడు. మొత్తంగా చూస్తే సన్‌రైజర్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరు మీద ఉంది. వార్నర్ 4,014 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 64 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్(21), మాక్రమ్(0)ను ఒకే ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. ఐదో ఓవర్లో అభిషేక్ శర్మ(16)ను సామ్ కర్రాన్, 10వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి(11)ని హర్షల్ పటేల్ ఔట్ చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మాక్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి. నటరాజన్
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రాజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..
IPL 2024: ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన ధోని.. జడేజా రికార్డును బద్దలు కొట్టి మరి..
Updated Date - Apr 09 , 2024 | 08:41 PM