ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ajinkya Rahane: రహానె ఈజ్ బ్యాక్.. ఒక్క ఇన్నింగ్స్‌తో వాళ్లకు ఇచ్చిపడేశాడు

ABN, Publish Date - Dec 05 , 2024 | 08:17 PM

Ajinkya Rahane: టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానె స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తన బ్యాట్ పవర్ ఏమాత్రం తగ్గలేదని అతడు ప్రూవ్ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను బాదిపారేశాడు.

టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానె స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తన బ్యాట్ పవర్ ఏమాత్రం తగ్గలేదని అతడు ప్రూవ్ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను బాదిపారేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో భాగంగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ సీనియర్ బ్యాటర్ చెలరేగిపోయాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో తాను ఏంటో నిరూపించాడు. ఓపెనర్‌గా వచ్చిన రహానె.. దాదాపుగా ఆఖరు వరకు బ్యాటింగ్ చేశాడు. ఏ ఒక్క బౌలర్‌ను వదలకుండా అందర్నీ టార్గెట్ చేసి ఉతికి ఆరేశాడు.


సెంచరీ మిస్..

ఆంధ్రతో మ్యాచ్‌లో 54 బంతులు ఎదుర్కొన్న రహానె.. 9 బౌండరీలు, 4 సిక్సుల సాయంతో 95 పరుగులు చేశాడు. కొద్దిలో అతడు సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ అయ్యాడు. క్రీజులో ఉన్నంత సేపు రహానె బ్యాట్ నుంచి భారీ షాట్లు వస్తూనే ఉన్నాయి. తన స్టైల్‌లో క్లాసికల్ బౌండరీలు కొడుతూనే.. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లు పలు సిక్సులు కూడా బాదాడు. మంచి బంతుల్ని కూడా బౌండరీ లైన్‌కు తరలించడంతో ప్రత్యర్థి బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. రహానె స్టన్నింగ్ బ్యాటింగ్‌తో ఆంధ్ర సంధించిన 229 పరుగుల టార్గెట్‌ను ముంబై మరో 3 బంతులు ఉండగానే ఛేదించింది.


సరిపోని టార్గెట్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. ఓపెనర్లు శ్రీకర్ భరత్ (93 నాటౌట్), అశ్విన్ హెబ్బర్ (52) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కెప్టెన్ రికీ భుయ్ (68) కూడా తన బ్యాట్ ప్రతాపం చూపించాడు. అందుకే జట్టు భారీ స్కోరు చేసింది. అయితే పృథ్వీ షా, రహానె, అయ్యర్, శివమ్ దూబె లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైకి ఈ స్కోరు సరిపోలేదు. బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపని రహానె సేన.. బ్యాటింగ్‌లో అదరగొట్టి విజయాన్ని అందుకుంది. అతడి ఇన్నింగ్స్ చూసిన ఫ్యాన్స్ రహానె ఈజ్ బ్యాక్ అని మెచ్చుకుంటున్నారు. అతడి పనైపోయిందన్న విమర్శకులకు ఇచ్చిపడేశాడని అంటున్నారు.


Also Read:

చరిత్రకు అడుగు దూరంలో కోహ్లీ.. ఏకైక బ్యాటర్‌గా రికార్డు

కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. ఏం చేయాలో తెలుసు: కమిన్స్

బ్రాండ్ వాల్యూలో ఆ ఐపీఎల్‌ టీమే టాప్.. సన్‌రైజర్స్ తగ్గేదేలే

ఇష్టం లేకపోయినా టీమ్ కోసమే ఆ పని చేస్తున్నా: రోహిత్ శర్మ

For More Sports And Telugu News

Updated Date - Dec 05 , 2024 | 08:22 PM