Hardik Pandya: హార్దిక్ పాండ్యాను బ్యాన్ చేసిన బీసీసీఐ.. అసలు కారణం ఇదే!
ABN, Publish Date - May 18 , 2024 | 11:44 AM
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ పెద్ద షాకిచ్చింది. అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అంతేకాదు.. రూ.30 లక్షల భారీ జరిమానా కూడా..
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) బీసీసీఐ (BCCI) పెద్ద షాకిచ్చింది. అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అంతేకాదు.. రూ.30 లక్షల భారీ జరిమానా కూడా విధించింది. ఇందుకు కారణం.. ఈ సీజన్‌లో ముంబై జట్టు వరుసగా మూడోసారి స్లో ఓవర్-రేట్‌ను కొనసాగించడమే. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఒక జట్టు మూడుసార్లు స్లో ఓవర్-రేట్‌ను మెయింటెయిన్ చేస్తే, ఆ జట్టు కెప్టెన్‌పై రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. అలాగే.. జట్టు సభ్యుల ఫీజులోనూ కోత విధిస్తారు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆ తప్పు చేయడం వల్లే.. బీసీసీఐ ఈ శిక్ష విధించింది.
అసలేంటీ ‘ప్లాన్-బీ’.. అమిత్ షా ఇచ్చిన సమాధానమేంటి?
‘‘ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో (LSG) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్లో ఓవర్-రేట్ కొనసాగించింది. ఈ సీజన్‌లో ముంబై జట్టు ఇలాంటి తప్పు చేయడం ఇది మూడోసారి. కాబట్టి.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం హార్దిక్ పాండ్యాకు రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు పాటు తదుపరి మ్యాచ్ ఆడకుండా అతడ్ని బ్యాన్ చేయడం జరిగింది’’ అని ఐపీఎల్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ లెక్క ప్రకారం.. ఐపీఎల్-2024లో ముంబై ఆడే తొలి మ్యాచ్‌కు పాండ్యా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇక పాండ్యాతో పాటు ముంబై జట్టులోకి ఇతర సభ్యులకు సైతం ఎదురుదెబ్బ తగిలింది. వారి మ్యాచ్ ఫీజుల్లో గట్టిగానే కోత విధించారు.
ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ అద్భుతం జరగాల్సిందే!
‘‘ఇంపాక్ట్ ప్లేయర్‌తో కలుపుకొని.. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడిన ముంబై తుదిజట్టులోని ఆటగాళ్లందరికీ రూ.12 లక్షలు జరిమానా, లేకపోతే మ్యాచ్ ఫీజుల్లో నుంచి 50 శాతం కోత విధించాం’’ అని ఐపీఎల్ యాజమాన్యం పేర్కొంది. ఏది తక్కువగా ఉంటే, అది విధిస్తామని వెల్లడించింది. కాగా.. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచి, పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో కూర్చుంది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు.. కేవలం నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేయగలిగింది. లక్నోతో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ ఘోర పరాజయం చవిచూసింది.
Read Latest Sports News and Telugu News
Updated Date - May 18 , 2024 | 11:44 AM