ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhuvneshwar Kumar: భువనేశ్వర్ సెన్సేషనల్ స్పెల్.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఎమోషనల్

ABN, Publish Date - Dec 05 , 2024 | 04:51 PM

Bhuvneshwar Kumar: టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించాడు. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ హార్ట్‌ను టచ్ చేస్తూ సంచలన బౌలింగ్‌తో చెలరేగాడు భువీ.

UP vs JHK: వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చాన్నాళ్లుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. గాయాలు వేధించడం, ఫామ్ కోల్పోవడం, మునుపటి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోవడంతో అతడు భారత జట్టులోకి తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోతున్నాడు. వయసు ప్రభావం వల్ల కూడా అతడి రీఎంట్రీ సాధ్యపడటం లేదని అనలిస్టులు అంటున్నారు. దీంతో భువీ పనైపోయిందని అంతా అనుకుంటున్నారు. ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్‌కే అతడు పరిమితం అవుతాడని చెబుతున్నారు. ఈ తరుణంలో భువీ వరుసగా సంచలన ప్రదర్శనలతో దుమ్మురేపుతున్నాడు. తనలో పస తగ్గలేదని అతడు మరోమారు నిరూపించాడు. హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిపోయాడు.


కుప్పకూల్చాడు

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో భువనేశ్వర్ సెన్సేషనల్ స్పెల్ వేశాడు. ఝార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు వెటరన్ పేసర్. ఆ వికెట్లన్నీ ఒకే ఓవర్‌లో తీయడం విశేషం. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసేందుకు వచ్చిన భువీ.. తొలి బంతికి చిచ్చరపిడుగు రాబిన్ మింజ్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత వరుస బంతుల్లో బాలకృష్ణ, ఆనంద్ తివారీని పెవిలియన్‌కు పంపించాడు. హ్యాట్రిక్‌తో చెలరేగిన భువనేశ్వర్.. ఒక మెయిడిన్ కూడా వేయడం మరో విశేషం.


ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ టెన్షన్

4 ఓవర్ల స్పెల్‌లో 1.50 ఎకానమీతో బౌలింగ్ చేశాడు భువనేశ్వర్. అతడి బౌలింగ్‌లో పరుగులు తీయడం పక్కనబెడితే వికెట్లు కాపాడుకోవడమే బ్యాటర్లకు కష్టమైపోయింది. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు విసిరిన సీనియర్ పేసర్.. ఇరు వైపులా బాల్‌ను స్వింగ్ చేస్తూ బ్యాటర్లకు నరకం చూపించాడు. బాల్‌ను టచ్ చేయాలన్నా భయపడేలా సెన్సేషనల్ స్పెల్ వేశాడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా ఆడిన 7 మ్యాచుల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడతను. అతడి బౌలింగ్ జోరు చూసిన సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. వజ్రం లాంటి ఆటగాడ్ని ఎస్‌ఆర్‌హెచ్ వదులుకుందని ఫీల్ అవుతున్నారు. తనను రీటైన్ చేసుకోలేదనే బాధ, కోపంతో వచ్చే ఐపీఎల్‌లో ఆరెంజ్ ఆర్మీపై విరుచుకుపడతాడేమోనని టెన్షన్ కూడా పడుతున్నారు.


Also Read:

అక్షర్ పటేల్ మాస్ బ్యాటింగ్.. వరల్డ్ కప్ ఫైనల్‌ గుర్తుకుతెచ్చేలా..

భయపెడుతున్న ఆడిలైడ్ పిచ్‌ హిస్టరీ.. ఎవ్వరికైనా అదే రిజల్టా..

అమ్మాయిలు ఫెయిల్.. బెండు తీస్తారనుకుంటే భయపడ్డారు

ఆస్ట్రేలియాతో సెకండ్ టెస్ట్.. రెండు కీలక మార్పులతో బరిలోకి భారత్

For More Sports And Telugu News

Updated Date - Dec 05 , 2024 | 04:56 PM