మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CSK vs RR: రాణించిన రుతురాజ్.. రాజస్థాన్‌పై చెన్నై విజయం

ABN, Publish Date - May 12 , 2024 | 07:24 PM

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి (145) ఛేధించింది.

CSK vs RR: రాణించిన రుతురాజ్.. రాజస్థాన్‌పై చెన్నై విజయం

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి (145) ఛేధించింది. రుతురాజ్ గైక్వాడ్ (42 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించడంతో పాటు రవీంద్ర (27), డేరిల్ మిచెల్ (22), దూబే (18), సమీర్ (15 నాటౌట్) తమవంతు సహకారం అందించడంతో.. చెన్నై జట్టు ఈ విక్టరీని సొంతం చేసుకోగలిగింది. ఈ విజయంతో చెన్నై జట్టు రన్ రేట్ మెరుగుపడటంతో, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానానికి పడిపోయింది.


వైసీపీ దుష్ప్రచారం.. పథకాల్లేవంటూ చంద్రబాబు ‘ఫేక్ ఆడియో’ వైరల్

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులే చేసింది. రియాన్ పరాగ్ ఒక్కడే (47 నాటౌట్) మెరుగ్గా రాణించగా.. మిగతా వాళ్లందరూ పెద్దగా సత్తా చాటలేకపోయారు. చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసి.. 141 పరుగులకే ఆర్ఆర్‌ని కట్టడి చేయగలిగారు. ఇక లక్ష్య ఛేధనలో భాగంగా.. చెన్నై జట్టు 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలుపొందింది. నిజానికి.. లక్ష్యం చిన్నదే కావడం, చెన్నైకి హోమ్ గ్రౌండ్ అవ్వడంతో.. లక్ష్యాన్ని త్వరగా ఛేధిస్తారని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే చెన్నై జట్టు మొదట్లో దూకుడుగా ఆడింది. ఓపెనర్లు చెలరేగి ఆడారు.

ప్రధాని మోదీకి సీఎం కౌంటర్.. ఆ హామీల సంగతేంటి?

తొలి రెండు వికెట్లు పడేదాకా.. చెన్నై స్కోరు పరుగులు పెట్టింది. కానీ.. రచిన్ రవీంద్ర, డేరిల్ మిచెల్ వికెట్లు పడ్డాక చెన్నై ఇన్నింగ్స్ నెమ్మదించింది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. చెన్నై బ్యాటర్లు భారీ షాట్లు కొట్టలేకపోయారు. ఒకానొక దశలో.. ఈ మ్యాచ్ చివర్లో త్రిల్లింగ్‌గా మారుతుందేమోనని అనిపించింది. కానీ.. ఓవర్లు తగ్గేకొద్దీ చెన్నై బ్యాటర్లు మళ్లీ పుంజుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఫైనల్‌గా 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేధించి, తన ప్లేఆఫ్స్ ఆశల్ని చెన్నై జట్టు మరింత మెరుగుపరచుకుంది.

Updated Date - May 12 , 2024 | 07:24 PM

Advertising
Advertising