MS Dhoni: ధోనీ నెక్ట్స్ సీజన్‌లో ఉంటాడా.. ఆ వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా?
ABN, Publish Date - Apr 23 , 2024 | 03:11 PM
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత అద్భుతంగా రాణిస్తున్నాడో అందరికీ తెలుసు. డెత్ ఓవర్స్‌లో క్రీజులోకి వచ్చి, భారీ షాట్లతో చెలరేగి మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. తన అభిమానులకు కావాల్సినంత ఎంటర్టైన్‌మెంట్ ఇస్తున్నాడు. అయితే..
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఎంత అద్భుతంగా రాణిస్తున్నాడో అందరికీ తెలుసు. డెత్ ఓవర్స్‌లో క్రీజులోకి వచ్చి, భారీ షాట్లతో చెలరేగి మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. తన అభిమానులకు కావాల్సినంత ఎంటర్టైన్‌మెంట్ ఇస్తున్నాడు. అయితే.. ఇదే సమయంలో ధోనీకి ఇదే చివరి సీజన్ కావొచ్చన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. రుతురాజ్ గౌక్వాడ్‌కి (Ruturaj Gaikwad) సీఎస్కే పగ్గాలు అప్పగించడం, కాలికి అయిన గాయం తీవ్రం అవుతుండటంతో.. ధోనీ నెక్ట్స్ సీజన్‌లో ఆడకపోవచ్చని అనుకుంటున్నారు. అందుకే.. ఈ సీజన్‌లో దుమ్మురేపుతున్నాడని క్రీడా వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.
కోహ్లి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత.. ఎందుకంటే..?
ఈ నేపథ్యంలోనే.. సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ (Michael Hussey) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ తదుపరి సీజన్‌లోనూ కొనసాగుతాడన్న ఓ సంకేతాన్ని ఇచ్చాడు. తొలుత ధోనీ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ధోనీ తన కెరీర్‌లో అద్భుతమైన స్థానంలో ఉన్నాడు. ఎంతో సౌకర్యవంతంగా, సంతోషంగా ఉన్న ధోనీ.. తన క్రికెట్‌ని ఆస్వాదిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభమవ్వడానికి ముందు ధోనీ చాలా ప్రాక్టీస్ చేశాడు. 42 ఏళ్ల వయసులో ధోనీ తనని తాను బ్యాటర్‌గా మరోసారి ఆవిష్కరించుకున్నాడు. ధోనీని ఔట్ చేసేందుకు బౌలర్లు విభిన్న ప్రణాళికలతో ముందుకొస్తున్నారు. ఎందుకంటే.. అతను ఆల్‌టైమ్ గ్రేట్ ఫినిషర్ కదా!’’ అని హస్సీ చెప్పుకొచ్చాడు. ధోనీ ఇప్పటికీ తనని తాను మెరుగుపరచుకుంటూ.. బౌలర్లకు అతిపెద్ద సవాల్‌గా మారుతున్నాడని కొనియాడాడు.
రూ.18.5 కోట్లు వృథా.. అతడికి తుది జట్టులో ఉండే అర్హత కూడా లేదు
ఇదే సమయంలో ధోనీ ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ.. అతని ప్రదర్శన, మనస్తత్వాన్ని బట్టి చూస్తే ఇప్పుడప్పుడే ధోనీ ఐపీఎల్‌కి దూరమయ్యే అవకాశం లేదని మైఖేల్ హస్సీ పేర్కొన్నాడు. అంటే.. ఇదే చివరి సీజన్ కాదని, నెక్ట్స్ సీజన్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరోక్షంగా తెలిపాడు. ఈ దశలోనూ ధోనీ పరిణామం చెందుతూనే ఉన్నాడు కాబట్టి.. అతను తన ఆటని కొనసాగిస్తాడన్న అభిప్రాయాన్ని హస్సీ వ్యక్తపరిచాడు. ధోనీ ఫ్యాన్స్‌కి ఇంతకన్నా మంచి వార్త ఇంకేముంటుంది చెప్పండి! అయితే.. నెక్ట్స్ సీజన్‌లోనూ ధోనీ ఉంటాడా? లేదా? అనే విషయంపై పూర్తి స్పష్టత రావాలంటే.. స్వయంగా అతను స్పందించేదాకా వేచి చూడాల్సిందే.
Read Latest Sports News and Telugu News
Updated Date - Apr 23 , 2024 | 03:13 PM