ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MS Dhoni-IPL: ఐపీఎల్ నుంచి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై బిగ్ అప్‌డేట్!

ABN, Publish Date - May 20 , 2024 | 05:37 PM

టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఐపీఎల్ నుంచి నిష్ర్కమించినట్టేనా?. ఐపీఎల్ కెరియర్‌కు ముగింపు పలకనున్నాడా?. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమవనున్నాడా?... శనివారం ఆర్సీబీ చేతిలో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశం కోల్పోయిన తర్వాత క్రికెటర్ వర్గాలు, అభిమానుల్లో వ్యక్తమవుతున్న సందేహాలివీ.

MS Dhoni

టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఐపీఎల్ నుంచి నిష్ర్కమించినట్టేనా?. ఐపీఎల్ కెరియర్‌కు ముగింపు పలకనున్నాడా?. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమవనున్నాడా?... శనివారం ఆర్సీబీ చేతిలో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశం కోల్పోయిన తర్వాత క్రికెటర్ వర్గాలు, అభిమానుల్లో వ్యక్తమవుతున్న సందేహాలివీ. అయితే ధోనీ రిటైర్మెంట్‌పై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్గాల నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది.


‘‘ఐపీఎల్ నుంచి వైదొలగుతున్నట్లు సీఎస్కే జట్టులో ధోనీ ఎవరికీ చెప్పలేదు. రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు కొన్ని నెలలపాటు వేచి చూస్తానని మేనేజ్‌మెంట్‌కు ధోనీ చెప్పాడు.వికెట్ల మధ్య పరిగెత్తడంలో ధోనీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదే అతడికి సానుకూల అంశం.


ధోనీ ఇచ్చే సమాచారం కోసం వేచిచూస్తాం. అతడు ఎప్పుడూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటాడు. ఏం జరుగుతుందో వేచిచూద్దాం’’ అని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎస్కే అధికారి పేర్కొన్నారు.


కాగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమితో సీఎస్కే ప్లే ఆఫ్స్ అవకాశాన్ని కోల్పోయింది. దీంతో ఎంఎస్ ధోనీ చెన్నై నుంచి రాంచీ వెళ్లిపోయాడు. దీంతో ఇకపై ఐపీఎల్‌లో ధోనీ ఆటను చూడలేమంటూ మీడియాతో పాటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.

Updated Date - May 20 , 2024 | 05:37 PM

Advertising
Advertising