ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dhruv Jurel: ఆసీస్‌ను వదలని జురెల్.. మరోమారు వణికించాడు

ABN, Publish Date - Nov 09 , 2024 | 07:03 PM

యంగ్ బ్యాటర్ ధృవ్ జురెల్ ఆస్ట్రేలియాను వదలడం లేదు. వరుసబెట్టి ఫైటింగ్ నాక్స్ ఆడుతూ భయపెడుతున్నాడు. సిసలైన బ్యాటింగ్ మజా ఏంటో చూపిస్తున్నాడు.

IND A vs AUS A: యంగ్ బ్యాటర్ ధృవ్ జురెల్ ఆస్ట్రేలియాను వదలడం లేదు. వరుసబెట్టి ఫైటింగ్ నాక్స్ ఆడుతూ కంగారూ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. సాలిడ్ డిఫెన్స్‌తో ప్రత్యర్థి బౌలర్లను భయపెడుతున్నాడు. సిసలైన బ్యాటింగ్ మజా ఏంటో ఆడియెన్స్‌కు మరోమారు పరిచయం చేశాడు జురెల్. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం కాస్త ముందుగానే కంగారూ గడ్డ మీదకు చేరుకున్న ఈ యువ బ్యాటర్.. ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంకోసారి తన తడాఖా చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్వితీయ బ్యాటింగ్‌తో అదరగొట్టిన జురెల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదే రేంజ్‌లో ఆడాడు.


నితీష్‌ అండగా..

ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (17), కేఎల్ రాహుల్ (10)తో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (11), దేవ్‌దత్ పడిక్కల్ (1), సాయి సుదర్శన్ (3) తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన జురెల్.. స్తంభంలా నిలబడిపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి (38) అండతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మొత్తంగా 122 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 68 పరుగులు చేశాడు. జురెల్ నిలబడకపోతే జట్టు ఎప్పుడో కుప్పకూలేది. తొలి ఇన్నింగ్స్‌లోలాగే మరోమారు కంగారూ బౌలర్లకు ఎదురొడ్డి ఆడాడతను. భారీ షాట్ల కంటే స్ట్రైక్ రొటేషన్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు.


అంతా వృథా

ఒకవైపు వికెట్లు పడిపోకుండా జాగ్రత్త పడుతూనే మరోవైపు స్కోరు బోర్డును కదిలించడం పైనా దృష్టి పెట్టాడు జురెల్. తాను స్ట్రైక్ రొటేషన్ చేస్తూ.. నితీష్ రెడ్డితో హిట్టింగ్ చేయించాడు. జురెల్ మరోమారు క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అతడి ఆట చూసిన నెటిజన్స్.. ఇదీ బ్యాటింగ్ అంటే అని మెచ్చుకుంటున్నారు. కాగా, సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ ఏ 229 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఛేజింగ్‌కు దిగిన ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జురెల్ ఇన్నింగ్స్ వృథా అయినా.. బీజీటీలో అతడు తప్పక తుదిజట్టులో ఉండేందుకు ఇది ఉపయోగపడిందని చెప్పొచ్చు. అదే సమయంలో కంగారూ టీమ్ అతడి కోసం స్పెషల్ ప్లాన్స్‌తో దిగక తప్పని పరిస్థితి నెలకొంది.


Also Read:

సముద్రంలో ధోని.. ఒడ్డున గమనిస్తున్నది ఎవరో తెలుసా..

సౌతాఫ్రికాతో సెకండ్ టీ20.. ఒక్క మార్పుతో బరిలోకి భారత్

సూర్య చెప్పిన ఒక్క మాటతో అంతా మారిపోయింది

For More Sports And Telugu News

Updated Date - Nov 09 , 2024 | 07:09 PM