ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Trump-Dhoni: ధోనీతో ట్రంప్.. యూఎస్ ప్రెసిడెంట్ సందడి మామూలుగా లేదుగా

ABN, Publish Date - Nov 06 , 2024 | 06:57 PM

Trump-Dhoni: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకమని తేల్చినా.. ప్రజలు మాత్రం మాజీ అధ్యక్షుడికే జై కొట్టారు.

US Elections 2024: ఇప్పుడు ఎక్కడ చూసినా అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అదే టాపిక్. మన దగ్గరే కాదు ప్రపంచ దేశాలకు పెద్దన్న లాంటి యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్స్ గురించి ఇతర చోట్లా చర్చించుకుంటున్నారు. అగ్రరాజ్య ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకమని తేల్చినా.. ప్రజలు మాత్రం మాజీ అధ్యక్షుడికే జై కొట్టారు. దీంతో ట్రంప్‌తో పాటు ఆయన మద్దతుదారులు, రిపబ్లిక్ పార్టీ కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. ఈ తరుణంలో భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో ట్రంప్ కలసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వెకేషన్ కోసం వెళ్లి..

ధోనీతో కలసి ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు వీళ్లిద్దరూ ఎప్పుడు గోల్ఫ్ ఆడారు.. ఇది అస్సలు ఊహించలేదని చాలా మంది నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ బాబాయ్‌ను అప్పుడే మాహీ కలిశాడా? గోల్ఫ్ కూడా ఆడారా? అని షాక్ అవుతున్నారు. అయితే ఇది ఇప్పటి వీడియో కాదు. గతేడాది సెప్టెంబర్‌లో వెకేషన్ కోసం ధోని యూఎస్‌కు వెళ్లిన సమయంలో ట్రంప్‌ను కలిశాడు. వీళ్లిద్దరూ కాసేపు గోల్ఫ్ ఆడారు. అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు డొనాల్డ్ ఎన్నికల్లో గెలవడంతో మళ్లీ వైరల్ అవుతోంది.


చరిత్రపుటలో నిలిచే విజయం

ఇక, అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయానికొస్తే.. 2016 నాటి రిజల్ట్స్‌కు భిన్నంగా ఈసారి పాపులర్ ఓటు కూడా ట్రంప్‌కే లభించింది. ఆయనకు 51 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు 47 శాతం ఓట్లు దక్కాయి. సంప్రదాయ రిపబ్లికన్ రాష్ట్రాలను నిలబెట్టుకున్న ట్రంప్.. స్వింగ్ స్టేట్స్‌ ఏడింటా గుత్తాధిపత్యం చూపించారు. గ్రామీణ ఓటర్ల నుంచి కూడా ఆయనకు బలమైన మద్దతు లభించింది. సర్వేలు ఇక్కడా బొక్కబోర్లా పడ్డాయి. అయోవా వంటి స్టేట్స్‌లో ఆయన విక్టరీనే దీనికి ఉదాహరణగా నిలిచింది.


Also Read:

అయ్యర్ మెరుపు సెంచరీ.. వాళ్ల మీద కసితో చెలరేగాడు

కోహ్లీకి ఘోర అవమానం.. పదేళ్లలో ఇదే ఫస్ట్ టైమ్

రీటైన్ చేయకపోయినా ఆర్సీబీతోనే మ్యాక్స్‌వెల్.. ఇదెక్కడి ట్విస్ట్

For More Sports And Telugu News

Updated Date - Nov 06 , 2024 | 06:58 PM