Gambhir-Rohit: గంభీర్‌నే ఎందుకు బలిచేస్తున్నారు.. రోహిత్ తప్పులు కనిపించట్లేదా..
ABN, Publish Date - Nov 09 , 2024 | 08:38 PM
ఒక్క సిరీస్.. ఒకే ఒక్క సిరీస్ భారత క్రికెట్‌లో లెక్కలన్నీ మార్చేస్తోంది. నిన్నటి వరకు జట్టులో చక్రం తిప్పిన వారు.. ఇప్పుడు బలిపీఠంపై కూర్చోవాల్సిన పరిస్థితి. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక్క సిరీస్.. ఒకే ఒక్క సిరీస్ భారత క్రికెట్‌లో లెక్కలన్నీ మార్చేస్తోంది. నిన్నటి వరకు జట్టులో చక్రం తిప్పిన వారు.. ఇప్పుడు బలిపీఠంపై కూర్చోవాల్సిన పరిస్థితి. అందరి తప్పు ఉన్నా ఒక్కర్నే బాధ్యుడ్ని చేయడం చర్చనీయాంశంగా మారింది. బలిపీఠంపై ఉన్న ఆ ఒక్కడు మరెవరో కాదు.. హెడ్ కోచ్ గౌతం గంభీర్. సేఫ్‌గా ఉన్నది కెప్టెన్ రోహిత్ శర్మ. గౌతీ బలవడం ఏంటి? హిట్‌మ్యాన్ తప్పించుకోవడం ఏంటి? ఈ పరిస్థితికి కారణం ఎవరు? అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బీసీసీఐ సీరియస్
న్యూజిలాండ్ సిరీస్ ఓటమిపై భారత క్రికెట్ బోర్డు ఫుల్ సీరియస్‌గా ఉందని తెలుస్తోంది. కొత్త కోచ్ గంభీర్ విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారట. అతడు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో శ్రీలంక టూర్‌లో వన్డే సిరీస్‌ను కోల్పోయింది టీమిండియా. రోహిత్, విరాట్ లాంటి టాప్ ప్లేయర్లు ఉన్న జట్టు ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే సిరీస్ ఓటమికి అటు సీనియర్లను గానీ ఇటు గౌతీని కూడా బాధ్యుల్ని చేయలేదు. పొట్టి వరల్డ్ కప్ నెగ్గిన జోష్‌లో దాన్ని అంతా తేలిగ్గా తీసుకున్నారు. గంభీర్ కూడా కొత్తగా వచ్చాడని ఏమీ అనలేదు. కానీ కివీస్ సిరీస్ ఓటమిని మాత్రం ఈజీగా తీసుకోవడం లేదు.
ఎందుకు వదిలేస్తున్నారు?
న్యూజిలాండ్ సిరీస్ ఓటమితో గంభీర్ అధికారాలకు కత్తెర వేయాలని బీసీసీఐ డిసైడ్ అయిందని సమాచారం. త్వరలో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గనుక టీమ్ ఓడిపోతే అతడి పోస్ట్ ఊస్టింగేనని అంటున్నారు. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌ను టెస్టు జట్టుకు కోచ్‌గా చేసి.. గౌతీని వన్డేలు, టీ20 కోచింగ్‌కు పరిమితం చేయాలని భావిస్తున్నారట. కంగారూ సిరీస్ అతడికి డూ ఆర్ డై అని వినిపిస్తోంది. అయితే గంభీర్‌ను మాత్రమే టార్గెట్ చేసి కెప్టెన్ రోహిత్ శర్మను వదిలేయడం ఏంటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొరడా ఝళిపించాల్సిందే
కివీస్ సిరీస్‌లో మహ్మద్ సిరాజ్‌ను నైట్ వాచ్‌మన్‌గా పంపడం, సర్ఫరాజ్ ఖాన్‌ను 8వ పొజిషన్‌లో ఆడించడం, బెంగళూరు టెస్టులో టాస్ నెగ్గి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారాయి. అయితే సిరీస్ ఓటమితో పాటు ఈ తప్పులకు గంభీర్‌నే బాధ్యుల్ని చేయడం చర్చకు దారితీసింది. జట్టు విషయంలో కోచ్‌గా గౌతీకి ఎంత బాధ్యత ఉంటుందో సారథిగా రోహిత్‌కు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రతి కీలక నిర్ణయం, వ్యూహం హిట్‌మ్యాన్ ఓకే చెప్పకపోతే అమలు కాదు. అలాంటప్పుడు గంభీర్ ఒక్కడ్నే ఎందుకు బలి చేస్తున్నారు? రోహిత్ మీద కూడా చర్యలు తీసుకోవాలి? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆసీస్ టూర్‌లో ఫెయిలైతే హిట్‌మ్యాన్ విషయంలోనూ యాక్షన్ తీసుకోవాలని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు. మరి.. ఈ విషయంలో బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి.
Also Read:
ఆసీస్‌ను వదలని జురెల్.. మరోమారు వణికించాడు
సముద్రంలో ధోని.. ఒడ్డున గమనిస్తున్నది ఎవరో తెలుసా..
సౌతాఫ్రికాతో సెకండ్ టీ20.. ఒక్క మార్పుతో బరిలోకి భారత్
For More Sports And Telugu News
Updated Date - Nov 09 , 2024 | 08:45 PM