ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gautam Gambhir: నెక్ట్స్ టార్గెట్ అదే.. హెడ్ కోచ్ వార్తలపై గంభీర్ బాంబ్

ABN, Publish Date - May 30 , 2024 | 03:19 PM

రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం దాదాపు అయిపోయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన..

Gautam Gambhir Breaks Silence On Head Coach News

రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) నియామకం దాదాపు అయిపోయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన హై-ప్రొఫైల్ ఓనర్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడని, గంభీర్‌తో హెడ్ కోచ్ డీల్ ఆల్రెడీ కుదిరిందని, ప్రకటన రావడమే తరువాయి అని ఓ నివేదిక వెల్లడించింది. ఇలాంటి తరుణంలో.. గౌతమ్ చేసిన షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. హెడ్ కోచ్ రూమర్లకు చెక్ పెట్టేలా.. తన నెక్ట్స్ టార్గెట్‌ని అతను రివీల్ చేశాడు. అతను ఈ హెడ్ కోచ్ రేసులో తాను లేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశాడు.


Read Also: టీమిండియా హెడ్ కోచ్ పదవికి ధోనీ అనర్హుడు.. ఎందుకో తెలుసా?

‘‘మా కేకేఆర్ జట్టు ఐపీఎల్‌లో ఇప్పటివరకూ మూడు టైటిళ్లు సాధించింది. కానీ.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో పోలిస్తే.. మేము ఇంకా రెండు కప్‌లు వెనుకబడి ఉన్నాం. ఈ సీజన్‌లో విజేతగా నిలిచామన్న విషయం సంతృప్తికరంగానే ఉంది కానీ.. ఐపీఎల్‌లో కేకేఆర్ అత్యంత విజయవంతమైన జట్టు కాదనే అసంతృప్తి నాలో ఉంది. మాది అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించాలంటే, మరో మూడు టైటిళ్లు సాధించాలి. ఇందుకోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మా తదుపరి లక్ష్యం కూడా అదే! కేకేఆర్‌ను ఐపీఎల్‌లో విజయవంతమైన జట్టుగా నిలపడం కన్నా గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. మా జర్నీ ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది’’ అని ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి తాను కేకేఆర్ మెంటార్‌గా కొనసాగుతానని గంభీర్ చెప్పకనే చెప్పేశాడు.


Read Also: ఆ కారణం వల్లే చోటు దక్కలేదు.. రింకూ సింగ్ షాకింగ్ కామెంట్స్

ఈ వ్యాఖ్యలతో టీమిండియా హెడ్ కోచ్ రేసులో గంభీర్ లేడనే క్లారిటీ దాదాపు వచ్చేసింది కాబట్టి.. ఆ బాధ్యతలు చేపట్టేది ఎవరనే చర్చలు మళ్లీ జోరందుకున్నాయి. బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పినట్టు.. దేశవాళీ క్రికెట్‌పై లోతైన అవగాహన కలిగిన ఓ భారతీయుడే హెడ్ కోచ్‌గా నియమించబడతాడని ఇప్పటికే తేలింది. దీంతో.. ఆ ఇండియన్ ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు.. ఈ పదవి కోసం బీసీసీఐ స్వీకరించే దరఖాస్తుల తేదీ కూడా మే 27వ తేదీతో ముగిసింది. మొత్తం 3 వేల దరఖాస్తులు అందినట్లు తెలిసింది. మరి, వారిలో నుంచి హెడ్ కోచ్‌గా ఎవరు నియమితులవుతారో?

Read Latest Sports News and Telugu News

Updated Date - May 30 , 2024 | 03:19 PM

Advertising
Advertising