Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఎందుకు బౌలింగ్ చేయలేదు.. ముంబై కెప్టెన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?
ABN, Publish Date - Apr 08 , 2024 | 09:43 AM
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదటి రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ వేశాడు కానీ, ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం బంతిని ముట్టలేదు. ఒక్కటంటే ఒక్క ఓవర్ కూడా వేయలేదు. దీంతో.. హార్దిక్ ఎందుకు బౌలింగ్ వేయలేదన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది.
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మొదటి రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ వేశాడు కానీ, ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం బంతిని ముట్టలేదు. ఒక్కటంటే ఒక్క ఓవర్ కూడా వేయలేదు. దీంతో.. హార్దిక్ ఎందుకు బౌలింగ్ వేయలేదన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. బహుశా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడని విమర్శలు వచ్చిన నేపథ్యంలో, అతడు బౌలింగ్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. హార్దిక్ వాదన మాత్రం మరోలా ఉంది. తాను సరైన సమయంలోనే బౌలింగ్ చేస్తానని పేర్కొన్నాడు.
విజయానికి ఒక్క అడుగు దూరంలోనే.. అప్పటిదాకా తగ్గేదేలేదన్న ఇజ్రాయెల్ ప్రధాని
‘‘నేను సరైన సమయంలో బౌలింగ్ వేస్తాను. ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్‌లో మేము ప్రతీది కవర్ చేశాం. కాబట్టి, నేను బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు’’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. తాము అప్పుడప్పుడు వ్యూహాత్మక మార్పులు చేస్తుంటామని, ఇప్పుడు జట్టుని మరింత పటిష్టం చేసుకోవడంలో దృష్టి సారించామని తెలిపాడు. బయట ప్రచారం జరుగుతున్నట్టు తమ టీమ్ సభ్యుల్లో ఎలాంటి భేధాభిప్రాయాలు లేవని, అందరూ ఎంతో ప్రేమగా మెలుగుతుంటామని, డ్రెస్సింగ్ రూమ్‌లో సరదాగా గడుపుతుంటామని పేర్కొన్నాడు. తొలి మూడు పరాజయాలు ఎదురైనప్పుడు.. ఒకరినొకరు మద్దతు ఇచ్చుకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగామని తెలిపాడు. మొత్తానికి.. తాము బలంగా నమ్మినట్టుగానే తొలి విజయాన్ని సాధించామని హార్దిక్ చెప్పాడు.
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన తొలి జట్టు
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్ (42), టిమ్ డేవిడ్ (45), షెఫర్డ్ (39) మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించడం వల్ల.. ముంబై అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. చివరివరకు గట్టిగానే పోరాడింది కానీ, ఫలితం లేకుండా పోయింది. 205 పరుగులకే పరిమితం కావడంతో ఓటమిపాలైంది. పృథ్వీ షా (66), స్టబ్స్ (71) తమ జట్టుని గెలిపించుకోవడం కోసం బాగానే పోరాడారు కానీ, చివరికి వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 08 , 2024 | 09:47 AM