ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs AFG: ధోని ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ

ABN, Publish Date - Jan 18 , 2024 | 09:09 AM

Rohit Sharma: భారత్, అప్ఘానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఫుల్ మజాను పంచింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో చివరి వరకు విజయం రెండు జట్లతో దోబుచులాటడింది. దీంతో తీవ్ర ఉత్కంఠ తప్పలేదు. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్ టైగా ముగిసింది.

బెంగళూరు: భారత్, అప్ఘానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఫుల్ మజాను పంచింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో చివరి వరకు విజయం రెండు జట్లతో దోబుచులాటడింది. దీంతో తీవ్ర ఉత్కంఠ తప్పలేదు. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్ టైగా ముగిసింది. రెండు జట్లు సమానంగా 212 పరుగులు చేశాయి. దీంతో మ్యాచ్ ఫలితం కోసం అంపైర్లు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. కానీ సూపర్ ఓవర్‌లో సైతం రెండు జట్లు పట్టు వదలకుండా పోరాడాయి. చివరకు సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో మ్యాచ్ ఫలితం కోసం అంపైర్లు రెండోసారి సూపర్ ఓవర్‌ను నిర్వహించక తప్పలేదు. అయితే ఈ సారి నిర్వహించిన సూపర్ ఓవర్‌లో భారత్‌ను విజయం వరించింది. కెప్టెన్ రోహిత్ శర్మ భారీ హిట్టింగ్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుత బౌలింగ్‌తో ఉత్కంఠ పోరులో భారత్ జయకేతనం ఎగురవేసింది. దీంతో భారత్‌పై కనీసం ఈ సారైనా గెలవాలనే అప్ఘానిస్థాన్ కల నెరవేరలేదు.


ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ, సూపర్ ఓవర్లలోనూ చెలరేగాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కగా.. శివమ్ దూబేకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. కాగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది 42వ విజయం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆల్‌టైమ్ రికార్డును హిట్‌మ్యాన్ రోహిత్ సమం చేశాడు. దీంతో ధోని సరసన రోహిత్ కూడా చేరాడు. మహేంద్ర సింగ్ ధోని కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా 42 విజయాలు అందుకున్నాడు. ధోని 72 మ్యాచ్‌ల్లో 42 విజయాలు నమోదు చేయగా.. రోహిత్ 54 మ్యాచ్‌ల్లోనే 42 విజయాలు నమోదు చేయడం గమనార్హం. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్లుగా మొదటి స్థానంలో రోహిత్, ధోనినే ఉన్నారు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా మరొక విజయం సాధిస్తే 43 విజయాలతో మొదటి స్థానానికి చేరుకుంటాడు. దీంతో జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ ఈ రికార్డును చేరుకునే అవకాశాలున్నాయి.

Updated Date - Jan 18 , 2024 | 09:09 AM

Advertising
Advertising