Rahul-Jaiswal: ఆసీస్‌తో ఆడుకున్న రాహుల్-జైస్వాల్.. ఏం ఆడారు భయ్యా
ABN, Publish Date - Nov 23 , 2024 | 03:43 PM
Rahul-Jaiswal: తొలి ఇన్నింగ్స్‌లో జరిగింది మళ్లీ రిపీట్ అవుతుందేమోనని అభిమానులు భయపడ్డారు. మళ్లీ జట్టు కుప్పకూలక తప్పదని ఆందోళన చెందారు. కానీ ఊహించనిది జరిగింది. ఒక్కో పరుగు తీసేందుకు బ్యాటర్లు వణికిన చోట.. కేఎల్ రాహుల్-యశస్వి జైస్వాల్ మ్యాజిక్ చేశారు.
పెర్త్: తొలి ఇన్నింగ్స్‌లో జరిగింది మళ్లీ రిపీట్ అవుతుందేమోనని అభిమానులు భయపడ్డారు. మళ్లీ జట్టు కుప్పకూలక తప్పదని ఆందోళన చెందారు. కానీ ఊహించనిది జరిగింది. ఒక్కో పరుగు తీసేందుకు బ్యాటర్లు వణికిన చోట.. కేఎల్ రాహుల్-యశస్వి జైస్వాల్ మ్యాజిక్ చేశారు. క్లాసికల్ బ్యాటింగ్‌తో అలరించారు. వరల్డ్‌లో మోస్ట్ డేంజరస్‌గా చెప్పుకునే పెర్త్ పిచ్ మీద అలవోకగా భారీ షాట్లు బాదారు. నీళ్లు తాగినంత ఈజీగా బౌండరీలు కొట్టారు. అలాగని వీళ్ల బ్యాటింగ్ సులువుగా ఏమీ సాగలేదు. కంగారూ బౌలర్ల నుంచి మొదట్లో ఎదురైన పోటీ, ఒత్తిడిని తట్టుకొని వాళ్ల భరతం పట్టారు రాహుల్-జైస్వాల్. వాళ్ల ఆట చూస్తే ఇది కదా బ్యాటింగ్ అంటే అనేలా సాగింది.
ఆటాడుకున్నారు
పెర్త్ పిచ్‌లో అనూహ్యమైన బౌన్స్, మంచి స్వింగ్, భీకరమైన పేస్, సీమింగ్ కండీషన్స్ ఉండటంతో తొలి రోజు బ్యాటింగ్ చేసేందుకు రెండు జట్ల బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రెండో రోజు మరీ ఆ రేంజ్‌లో కాకపోయినా బాల్ బాగానే స్వింగ్ అవడంతో పాటు వికెట్ మీద పేస్‌కు మంచి హెల్ప్ దొరికింది. దీన్ని ఉపయోగించుకొని రాహుల్-జైస్వాల్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు కంగారూ పేసర్లు. కానీ ఓపికతో ఆడిన ఈ ఇద్దరు బ్యాటర్లు క్రీజులో కుదురుకునేందుకు టైమ్ తీసుకున్నారు. ఒక్కసారి సెటిల్ అయ్యాక తమ రేంజ్ షాట్లు ఆడుతూ ప్రత్యర్థులతో ఆటాడుకున్నారు.
ఫుల్ డామినేషన్
స్ట్రయిట్ డ్రైవ్స్, పుల్ షాట్స్, కళ్లుచెదిరే ఫ్లిక్ షాట్స్‌తో రాహుల్ అదరగొట్టాడు. పుల్ షాట్స్‌తో పాటు ముందుకొచ్చి ఫ్రంట్ ఫుట్ షాట్స్ కొట్టి ప్రత్యర్థులపై ఫుల్ డామినేషన్ చూపించాడు జైస్వాల్. ఒకవైపు మంచి బంతులు వచ్చినప్పుడు సాలిడ్ డిఫెన్స్ చేస్తూనే.. మరోవైపు చెత్త బంతుల్ని శిక్షించారు. కాస్త లెంగ్త్ తప్పినా బౌండరీలకు పంపించారు. అదే సమయంలో టైట్ లెంగ్త్‌లో పడిన పలు బంతుల్ని కూడా తమ టెక్నిక్‌తో ఫోర్లు, సిక్సులుగా మలిచారు. ఓవరాల్‌గా జైస్వాల్ 193 బంతుల్లో 90 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. రాహుల్ 153 బంతుల్లో 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీళ్ల ఫైటింగ్ వల్ల భారత్ లీడ్ 218 పరుగులకు చేరుకుంది. మూడో రోజు కూడా ఇలాగే ఆడితే మ్యాచ్ మన చేతిలోకి పూర్తిగా వచ్చేసినట్లే.
Also Read:
సచిన్‌ను గుర్తుచేసిన రాహుల్.. చూసేందుకు రెండు కళ్లు చాలవంతే..
స్నేహిత్‌కు కాంస్యం
72 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. పెర్త్ టెస్ట్‌లో అరుదైన రికార్డు
For More Sports And Telugu News
Updated Date - Nov 23 , 2024 | 03:57 PM