Mitchell Starc: స్టార్క్ స్టన్నింగ్ డెలివరీకి బిత్తరపోయిన గిల్.. ఇదేం బౌలింగ్ సామి
ABN, Publish Date - Dec 07 , 2024 | 05:22 PM
Mitchell Starc: ఆస్ట్రేలియా వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు భారత యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ బిత్తరపోయాడు. తన అమ్ములపొదిలోని ప్రధాన అస్త్రాన్ని బయటకు తీసి గిల్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు స్టార్క్.
IND vs AUS: ఆస్ట్రేలియా వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ తన బౌలింగ్‌లో పస ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాడు. అడిలైడ్ టెస్టులో వికెట్ల పండుగ చేసుకుంటున్నాడు. పెర్త్ టెస్టులో రాణించినా తన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అతడ్ని టార్గెట్ చేసుకొని స్లెడ్జింగ్ చేశాడు. నీ బౌలింగ్ స్పీడ్ ఇంతేనా.. బంతులు చాలా స్లోగా వస్తున్నాయి అంటూ స్టార్క్ అహాన్ని దెబ్బతీశాడు జైస్వాల్. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సీనియర్ పేసర్.. పింక్ బాల్ టెస్ట్‌లో తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగిన స్టార్క్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తున్నాడు.
లేట్ స్వింగర్‌తో..
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్‌ను భయపెట్టాడు స్టార్క్. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌లో భీకర వేగంతో బంతులు విసురుతూ క్రీజులో నిలదొక్కుకోకుండా చేశాడు. అతడితో పాటు మరో ఎండ్ నుంచి స్కాట్ బోలాండ్ కూడా నిప్పులు చెరిగాడు. అయినా వాళ్లను సమర్థంగా ఎదుర్కొని 30 బంతుల్లో 28 పరుగులు చేశాడు గిల్. అయితే మరింత డేంజరస్‌గా మారుతున్న యంగ్‌స్టర్‌ను స్టార్క్ పెవిలియన్‌కు పంపించాడు. తన అమ్ములపొదిలోని లేట్ స్వింగర్‌తో గిల్ పనిబట్టాడు.
రెప్పపాటులోనే అంతా..
స్టార్క్ ఫుల్ లెంగ్త్‌లో వేసిన బంతి పడి కాస్త ఆలస్యంగా స్వింగ్ అయింది. దాన్ని డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు గిల్. బాల్ మూమెంట్‌ను పసిగట్టంలో అతడు పూర్తిగా తడబడ్డాడు. దీంతో అతడి బ్యాట్, ప్యాడ్‌కు మధ్యలో ఉన్న సందులో నుంచి వికెట్ల దిశగా దూసుకెళ్లింది బంతి. వెళ్లి వేగంగా స్టంప్స్‌ను గిరాటేసింది. రెప్పపాటులో బంతి తన బ్యాట్‌ను బీట్ చేసి వికెట్లను గిరాటేయడంతో ఏం జరిగిందో తెలియక గిల్ బిత్తరపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, రెండో రోజు ముగిసేసరికి సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఆసీస్ స్కోరుకు ఇంకా 29 పరుగులు వెనుకబడింది రోహిత్ సేన.
Also Read:
శనిలా తగులుకున్న హెడ్.. రోహిత్‌పై ఎందుకింత పగ
అంపైర్‌తో గొడవకు దిగిన కోహ్లీ.. ప్రూఫ్స్ చూపించి మరీ..
అంపైర్‌తో గొడవకు దిగిన కోహ్లీ.. ప్రూఫ్స్ చూపించి మరీ..
ఆస్ట్రేలియాకు కోహ్లీ వార్నింగ్.. రా చూస్కుందామంటూ..
For More Sports And Telugu News
Updated Date - Dec 07 , 2024 | 05:30 PM