ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs ENG: ఉప్పల్ టెస్ట్‌లో టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టు ఎలా ఉందంటే..?

ABN, Publish Date - Jan 25 , 2024 | 09:14 AM

ఉప్పల్ టెస్ట్‌లో పర్యాటక జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడిన భారత జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేసే వాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

హైదరాబాద్: ఉప్పల్ టెస్ట్‌లో పర్యాటక జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడిన భారత జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేసే వాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. పిచ్ పొడిగా కనిపిస్తోందని చెప్పాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన, బౌలింగ్ చేసిన గెలవడానికి తమ దగ్గర సరైన నైపుణ్యాలున్నాయని పేర్కొన్నాడు. ఇంతకుముందు కూడా తాము ఇలాంటి పరిస్థితుల్లో ఆడామని, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తమకు తెలుసని అన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. పేసర్లుగా బుమ్రా, సిరాజ్.. స్పిన్నర్లుగా జడేజా, అశ్విన్, అక్షర్ ఆడుతున్నారని తెలిపాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకోకపోవడం కష్టతరమైనదని పేర్కొన్నాడు. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితుల్లో అక్షర్ పటేల్ బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్ కూడా బాగా చేశాడని అందుకే అతన్ని తీసుకున్నట్టు రోహిత్ శర్మ చెప్పాడు.


టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ సాధించడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. తమకే కాదని ఇక్కడికి వచ్చే ప్రతి జట్టుకు టీమిండియా నుంచి సవాల్ ఎదురవుతుందనే సంగతి తమకు తెలుసని చెప్పాడు. ఈ మ్యాచ్‌‌తో టామ్ హర్ట్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నట్టు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కూడా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. కాగా టెస్టు సిరీస్‌ల్లో 2012 నుంచి స్వదేశంలో టీమిండియాకు ఎదురే లేకుండా పోయింది. ఆసియాలో వరుసగా 16 సిరీస్‌లు నెగ్గిన టీమిండియా.. వాటిల్లో ఏడింటిని క్లీన్‌స్వీప్‌ చేయడం విశేషం. ఈ పుష్కర కాలంలో దేశంలో ఆడిన 44 టెస్టుల్లో మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే భారత్‌ పరాజయాన్ని చవిచూసింది. అదే ఊపును ఈ సారి కూడా కొనసాగించి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్‌పైనే అందరి దృష్టి ఉంది.

తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్

Updated Date - Jan 25 , 2024 | 09:23 AM

Advertising
Advertising