IND vs ENG: రోహిత్ సేనకు ఘనస్వాగతం పలికిన వైజాగ్.. క్రికెటర్లను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు
ABN, Publish Date - Jan 31 , 2024 | 01:37 PM
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు వైజాగ్‌లో అడుగుపెట్టింది. వైజాగ్ విమానాశ్రయంలో రోహిత్ సేనకు ఘనస్వాగతం లభించింది. భారత క్రికెటర్లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
వైజాగ్: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు వైజాగ్‌లో అడుగుపెట్టింది. వైజాగ్ విమానాశ్రయంలో రోహిత్ సేనకు ఘనస్వాగతం లభించింది. భారత క్రికెటర్లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. టీమిండియా ఆటగాళ్లు వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు ముందే విమానాశ్రయానికి చేరుకుని వారి రాక కోసం వేచిచూశారు. క్రికెటర్లు రాగానే వారిని చూసి ఆనందించారు. క్రికెటర్లను అభిమానులు ఫోటోలు తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లు హోటల్ గదికి చేరుకున్నారు. ఆటగాళ్లు వెళ్లిన రోడ్ల వెంబడి అభిమానులు భారీ ఎత్తును గుమిగూడారు. మొత్తంగా తమ నగరానికి వచ్చిన టీమిండియా ఆటగాళ్లకు వైజాగ్ వాసులు ఘనస్వాగతం పలికారు. ఇక హోటల్‌కు చేరుకున్న భారత క్రికెటర్లకు అక్కడి సిబ్బంది సాంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికింది. కాగా 5 సంవత్సరాల తర్వాత భారత జట్టు వైజాగ్‌లో మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడనుంది.
ఇక హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓడిన టీమిండియా రెండో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మొదటి టెస్టులో జరిగిన తప్పులను పునారావృతం కానీయకుండా అన్ని విభాగాల్లో సత్తా చాటాలని రోహిత్ సేన భావిస్తోంది. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో కొంతకాలంగా వరుసగా విఫలమవుతున్న యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఈ టెస్టులో రాణించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో మన స్పిన్నర్లు అంతగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో ఈ మ్యాచ్ స్పిన్నర్లు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అలాగే ఫీల్డింగ్‌లోనూ మన జట్టు సత్తా చాటాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లో కీలక సమయంలో క్యాచ్‌లు వదిలేయడంతో భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. దీంతో వైజాగ్ టెస్టులో ఫీల్డింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై కూడా జట్టు దృష్టిసారించింది.
Updated Date - Jan 31 , 2024 | 01:38 PM