ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs ENG: హైదరాబాద్ వచ్చేసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ నెల 25 నుంచి..

ABN, Publish Date - Jan 22 , 2024 | 08:04 AM

ఇంగ్లండ్ క్రికెట్ టీం హైదరాబాద్ వచ్చేసింది. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు ఆదివారం హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. అబుదాబిలో దాదాపు నెల రోజుల క్యాంపు తర్వాత ఇంగ్లీష్ జట్టు నేరుగా హైదరాబాద్‌కు వచ్చింది.

హైదరాబాద్: ఇంగ్లండ్ క్రికెట్ టీం హైదరాబాద్ వచ్చేసింది. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు ఆదివారం హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. అబుదాబిలో దాదాపు నెల రోజుల క్యాంపు తర్వాత ఇంగ్లీష్ జట్టు నేరుగా హైదరాబాద్‌కు వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు సాంప్రదాయ పద్దతిలో ఆహ్వానం లభించింది. మరోవైపు ఆటగాళ్లను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. హలో హైదరాబాద్.. ఇది ముత్యాల నగరం అంటూ రాసుకొచ్చింది. కాగా భారత్‌, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభంకానుంది.


ఈ నేపథ్యంలో అబుదాబిలో దాదాపు నెల రోజుల క్యాంపు అనంతరం ఇంగ్లండ్ జట్టు భారత్‌కు వచ్చింది. ఆ జట్టు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా టెస్ట్ సిరీస్ బరిలోకి దిగనుంది. దీంతో ఇంగ్లండ్ టీంపై మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించిన రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం భాగ్యనగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌లో టెస్ట్ మ్యాచ్ జరిగి చాలా కాలం కూడా అయిపోయింది. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 సైకిల్‌లో భాగంగా రెండు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 సైకిల్‌లో ఇంగ్లీష్ జట్టు ఇప్పటివరకు 2 విజయాలు నమోదు చేయడంతోపాటు యాషెస్ సిరీస్‌ను డ్రా చేసుకుంది. కాగా హైదరాబాద్‌లో టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే రెండో టెస్ట్ మ్యాచ్ వైజాగ్‌లో జరగనుంది. ఇలా రెండు వరుస అంతర్జాతీయ మ్యాచ్‌లు తెలుగు రాష్ట్రాల్లో వెంట వెంటనే జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇంగ్లండ్ టెస్ట్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, రెహాన్ అహ్మద్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, మార్క్ వుడ్, షోయిబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), డాన్ లారెన్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, అలీ పోప్, అలీ రాబిన్సన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 22 , 2024 | 08:04 AM

Advertising
Advertising