IND vs ENG: అతను మా జట్టులో కీలక బౌలర్.. ఉప్పల్ టెస్ట్‌కు ముందు లోకల్ బౌలర్‌పై రోహిత్ ప్రశంసలు
ABN, Publish Date - Jan 24 , 2024 | 01:34 PM
ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో రాణిస్తామని, అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ను కైవసం చేసుకుంటామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. అలాగే లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్‌పై హిట్‌మ్యాన్ ప్రశంసలు కురిపించాడు.
హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో రాణిస్తామని, అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ను కైవసం చేసుకుంటామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. అలాగే లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్‌పై హిట్‌మ్యాన్ ప్రశంసలు కురిపించాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ గెలుపుపై ధీమా వ్యక్తం చేశాడు. రెండు నెలలుగా తమ ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పాడు. అయితే ఇంగ్లండ్ జట్టులో బలమైన ఆటగాళ్లు ఉన్నారన్న హిట్‌మ్యాన్.. వారిని తక్కువగా అంచనా వేయలేమని చెప్పుకొచ్చాడు. ఉప్పల్ టెస్టులో పక్కా వ్యూహంతో మైదానంలోకి దిగుతున్నట్టు తెలిపాడు. ఈ క్రమంలోనే 20 ఏళ్ల క్రితం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లకు ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లకు చాలా వ్యత్యాసం ఉందని అన్నాడు.
సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుకు దూరమవడం తమకు లోటేనని రోహిత్ చెప్పాడు. జట్టులోకి స్థానం కల్పించేందుకు యువ ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పాడు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లలో తుది జట్టులో ఎవరినీ ఆడించాలనేది తమకు పెద్ద తలనొప్పిగా మారిందని ఆయన చెప్పుకొచ్చాడు. ‘‘టెస్ట్ క్రికెట్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 20 ఏళ్ల క్రితం ఉన్న టెస్ట్ మ్యాచ్‌లకు ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లకు చాలా వ్యత్యాసం ఉంది. ఇక విరాట్ కోహ్లీ జట్టుకు దూరం అవ్వడం మాకు పెద్ద లోటే. జట్టులో స్థానం కోసం యువ ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుంటాం. సీనియర్లకు కూడా తలుపులు మూసుకుపోలేదు. మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లలో ఎవరిని అడించాలన్నది పెద్ద తల నొప్పే. పరిస్థితులకు అనుగుణంగా ఎవ్వరినీ ఆడించాలనేది నిర్ణయిస్తాం. మహ్మద్ సిరాజ్ గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. అతను మా జట్టులో ఒక కీలక బౌలర్.’’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 24 , 2024 | 01:34 PM