IND vs ENG: చివరి టెస్టులో బుమ్రా ఆడతాడా.. లేదా.. రెండు కీలక మార్పులు తప్పవా?..
ABN, Publish Date - Feb 28 , 2024 | 04:32 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకున్న టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభంకానున్న చివరి టెస్టులోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే వర్క్ లోడ్ కారణంగా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
ధర్మశాల: ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకున్న టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభంకానున్న చివరి టెస్టులోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే వర్క్ లోడ్ కారణంగా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా సిరీస్ గెలవడంతో ఐదో టెస్టులో బుమ్రాను ఆడిస్తారా? లేదా? అనే ఆసక్తి నెలకొంది. భవిష్యత్ అవసరాల దృష్యా ఆకాష్ దీప్‌ను కొనసాగించి చివరి టెస్టులోనూ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అయితే పలు నివేదికల ప్రకారం.. ఐదో టెస్టులో బుమ్రా ఆడనున్నాడు. నాలుగో టెస్టులో విశ్రాంతి కల్పించడంతో ఐదో టెస్టులో ఆడించాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించిందని సమాచారం. బుమ్రా జట్టులోకి వస్తే ఆకాష్ దీప్ బెంచ్‌కే పరిమితం అవుతాడు.
అయితే గాయం కారణంగా గత మూడు టెస్టులకు దూరమైన కేఎల్ రాహుల్ ఐదో టెస్టుకు కూడా దూరం కానున్నాడని సమాచారం. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో చికిత్స నిమిత్తం రాహుల్‌ను బీసీసీఐ లండన్ పంపినట్లు తెలుస్తోంది. అయితే రాహుల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు రజత్ పటీదార్ వరుసగా విఫలమవుతున్నాడు. ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేక మూడు టెస్టుల్లో విఫలమయ్యాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా రెండు సార్లు డకౌట్ అయ్యాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అత్యధిక స్కోర్ 32 మాత్రమే. దీంతో ఐదో టెస్టులో రాహుల్ రాకపోయినా పటీదార్‌కు తుది జట్టులో చోటు కష్టంగానే కనిపిస్తోంది. చివరి టెస్టులో పటీదార్ స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను ఆడించే అవకాశాలున్నాయి.
Updated Date - Feb 28 , 2024 | 04:32 PM