ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs ENG: కోహ్లీ స్థానం కోసం ముగ్గురి మధ్య తీవ్ర పోటీ.. రేసులో ఎవరెవరంటే..

ABN, Publish Date - Jan 23 , 2024 | 12:32 PM

ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక బ్యాటరైన విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ముఖ్యంగా ఈ వార్త తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

హైదరాబాద్: ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక బ్యాటరైన విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ముఖ్యంగా ఈ వార్త తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఎందుకంటే సిరీస్‌లోని మొదటి రెండు టెస్టు మ్యాచ్‌లు తెలుగు రాష్ట్రాల్లోనే జరగనున్నాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుండగా.. రెండో టెస్ట్ మ్యాచ్ ఏపీలోని వైజాగ్ వేదికగా జరగనుంది. దీంతో ఈ రెండు మ్యాచ్‌లను చూడడానికి కేవలం కోహ్లీ కోసమే స్టేడియానికి వచ్చే అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కానీ కోహ్లీ సడంగా తప్పుకోవడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ప్రస్తుతం కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చే ఆటగాడు ఎవరనే చర్చ నడుస్తోంది. కాగా ఇప్పటివరకు కోహ్లీ స్థానంలో సెలెక్టర్లు ఎవరినీ ఎంపిక చేయలేదు.


గురువారం నుంచి టెస్టు సిరీస్ ప్రారంభంకానుండడంతో నేడో రేపో సెలెక్టర్లు ఆ ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలున్నాయి. కోహ్లీ స్థానం కోసం ప్రధానంగా ముగ్గురు బ్యాటర్లు పోటీ పడుతున్నారు. ఇందులో ఇద్దరు యువ ఆటగాళ్లు కాగా.. మరొకరు సీనియర్ ఆటగాడు కావడం గమనార్హం. వారే సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్, చటేశ్వర్ పుజారా. ప్రస్తుతం వీరి ముగ్గురు రేసులో ఉన్నారు. ముగ్గురిలో ఎవరికి చోటు దక్కిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, పటీదార్ భారత్‌ ‘ఎ’ తరఫున చక్కగా రాణిస్తున్నారు. ఇంగ్లండ్‌ లయన్స్‌పై పటీదార్‌ 151 రన్స్‌ చేయగా, సర్ఫరాజ్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఈ పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సర్ఫరాజ్ ఖాన్ 96, 55 పరుగులతో రాణించాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ గత మూడు రంజీ సీజన్లలో అద్భుత సగటును కల్గి ఉన్నాడు. వరుసగా అతని సగటు 144, 122, 91గా ఉంది. ఇప్పటికే సర్ఫరాజ్‌ను టీమిండియాలోకి ఎంపిక చేయకపోవడం పట్ల సెలెక్టర్లపై విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే రేసులో సర్ఫరాజ్ ఖాన్ అందరి కంటే ముందు వరుసలో ఉండే అవకాశాలున్నాయి.

గత నెలలో జరిగిన సౌతాఫ్రికా పర్యటన ద్వారా వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రజత్ పటీదార్ కూడా రేసులో ముందున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని సగటు 45గా ఉంది. చాలా కాలంగా నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఇండియా ఏ తరఫున ఆడుతున్నాడు. ఇంగ్లండ్ లయన్స్‌పై గత రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. 151, 111 పరుగులతో సత్తా చాటాడు. వీరిద్దరితోపాటు చటేశ్వర్ పుజారాకు కూడా చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు. 35 ఏళ్ల పుజారా ప్రస్తుతం రంజీ ట్రోఫీలో దుమ్ములేపుతున్నాడు. ఓ డబుల్ సెంచరీ కూడా సాధించాడు. గతంలో టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉన్న పుజారా ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుత ఫామ్, అనుభవం దృష్యా పుజారాను కూడా ఎంపిక చేసే అవకాశాలున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 23 , 2024 | 12:32 PM

Advertising
Advertising