IND vs ENG:హెడ్ కోచ్ ద్రావిడ్ రికార్డును బ్రేక్ చేసిన యశస్వీ జైస్వాల్
ABN, Publish Date - Feb 24 , 2024 | 09:22 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ చెలరేగుతున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు బాదిన జైస్వాల్ 600కుపైగా పరుగులు సాధించాడు.
రాంచీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ చెలరేగుతున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు బాదిన జైస్వాల్ 600కుపైగా పరుగులు సాధించాడు. శుక్రవారం నుంచి ప్రారంభమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలోనూ జైస్వాల్ రాణించాడు. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 73 పరుగులతో సత్తా చాటాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో జైస్వాల్ ఇప్పటివరకు 618 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రికార్డును జైస్వాల్ బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో టీమిండియా బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో ద్రావిడ్ 602 పరుగులు చేశాడు. ప్రస్తుతం ద్రావిడ్‌ను జైస్వాల్ అధిగమించాడు. 2016/17 సిరీస్‌లో 618 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే 2018లో విరాట్ కోహ్లీ చేసిన 593 పరుగులను జైస్వాల్ అధిగమించాడు.
అంతేకాకుండా ఓ టెస్ట్ సిరీస్‌లో 600 పరుగులు చేసిన తొలి భారత ఎడమ చేతి బ్యాటర్‌గా యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో 600 పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా కూడా నిలిచాడు. అలాగే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు బాదిన టీమిండియా బ్యాటర్‌గా యశస్వీ జైస్వాల్ రికార్డు నెలకొల్పాడు. నాలుగో టెస్ట్ మ్యాచ్ టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో షోయబ్ బషీర్ వేసిన ఓవర్లో సిక్సు కొట్టడం ద్వారా జైస్వాల్ ఈ రికార్డును చేరుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 16 ఏళ్ల రికార్డును జైస్వాల్ బద్దలుకొట్టాడు. 2008లో సెహ్వాగ్ 22 సిక్సులు బాదాడు. తాజాగా 23 సిక్సులతో సెహ్వాగ్ రికార్డును జైస్వాల్ అధిగమించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 24 , 2024 | 09:22 PM