ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs PM XI: పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్: టాస్ గెలిచిన రోహిత్.. ఇవాళైనా ఆడతారా..

ABN, Publish Date - Dec 01 , 2024 | 10:18 AM

ఆటలో పైచేయి సాధించేందుకు భారత బౌలర్లు వికెట్లపై కన్నేశారు. వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

Captain Rohit

క్యాన్‌బెర్రా: పింక్ బాల్‌తో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే, సోమవారం ప్రాక్టీస్ మ్యాచ్ తొలి రోజుకు వరుణుడు తీవ్ర అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్ ను రద్దు చేయాల్సి వచ్చింది. ఇక ఇవాళ రెండోరోజు బరిలోకి దిగిన భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది. బిడ్డ పుట్టడంతో మొన్నటివరకు ఆసిస్ పర్యటనకు దూరంగా ఉన్న జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇవాళ జట్టులోకి తిరిగి చేరాడు. దీంతో అందరి కళ్లూ అతడిపైనే ఉన్నాయి. ఇవాళ కూడా వర్ష సూచనలు ఉండటంతో ఈ రోజైనా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ పూర్తవుతుందా? లేక ఈ మ్యాచ్ లేకుండానే పింక్ బాల్ టెస్టుకు వెళ్లాల్సి వస్తుందా అనే విషయంపై ఆసక్తి నెలకొంది.


ఇవాళ్టి మ్యాచ్ కీలకం..

ఇవాళ వర్షం లేకపోవడంత ఇరు జట్లు 50 ఓవర్ల చొప్పున ఆడేందుకు నిర్ణయించుకున్నాయి. ఇక రోహిత్ శర్మతో పాటు మరో కీలక ఆటగాడు శుభ్ మన్ గిల్ సైతం తొలి టెస్టుకు గాయం కారణంగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 6న ఆడిలైడ్ వేదికగా జరగనున్న పింక్ బాల్ టెస్టు మ్యాచ్ కోసం ఇరు జట్లు పోటాపోటీగా సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు పింక్ బాల్ మ్యాచ్ లు ఆడిన అనుభవం టీమిండియాకు పెద్దగా లేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ టీమిండియాకు మరింత కీలకం కానుంది.


ఆ ఇద్దరూ రాణించాలంటే..

రోహిత్ శర్మ, గిల్ కు సైతం తిరిగి ఫామ్ ను అందుకునేందుకు ఇది మంచి తరుణంగా భావించవచ్చు. డబ్ల్యూటీసీ 2025లో భారత్ కు ఇది చివరి టెస్టు సిరీస్ కావడంతో ఎలాగైనా టైటిల్ గెలవాలని భారత ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. ఇక వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ కు చేరుకోవాలంటే భారత్ ఈ సిరీస్ ను 4-0 లేదా 4-1తో గానీ కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇతర జట్ల రిజల్ట్ పైనే టీమిండియా విజయం ఆధారపడి ఉంటుంది.

Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ రికార్డును చిత్తు చేసిన మరో ఆటగాడు


Updated Date - Dec 01 , 2024 | 10:20 AM