Gautam Gambhir: పీకల మీదకు తెచ్చుకున్న గంభీర్.. అంతా స్వయంకృతమే
ABN, Publish Date - Dec 09 , 2024 | 09:32 AM
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ పీకల మీదకు తెచ్చుకున్నాడు. అటు భారత క్రికెట్ బోర్డుతో పాటు ఇటు అభిమానుల నుంచి కూడా అతడికి రోజురోజుకీ మద్దతు కరువవుతోంది.
IND vs AUS: ఏ రంగంలోనైనా సక్సెస్ ఆధారంగానే అన్నీ నడుస్తాయి. విజయం వచ్చినప్పుడు అభినందించడం, పరాజయం పాలైనప్పుడు విమర్శించడం పరిపాటే. అందుకు క్రికెట్ కూడా మినహాయింపేమీ కాదు. జెంటిల్మన్ గేమ్‌లో టీమ్ లేదా ప్లేయర్లు, కోచ్‌లు సక్సెస్‌లో ఉంటే వారిని అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతారు. అదే వైఫల్యాల్లో ఉంటే క్రిటిసైజ్ చేస్తారు. అయితే చేజేతులా విమర్శలపాలవడం సరికాదు. తప్పుల మీద తప్పులు చేస్తూ పీకల పైకి తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. గౌతీ అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
డౌట్స్ షురూ
టీ20 ప్రపంచ కప్-2024 తర్వాత నుంచి భారత్‌కు కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు గంభీర్. ఈ ఏడాది జూన్ 9వ తేదీన హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఈ ఆర్నెళ్ల కాలంలో అతడి హయాంలో గెలుపుల కంటే ఓటములే ఎక్కువగా చవిచూసింది టీమిండియా. శ్రీలంక టూర్‌లో వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ అయింది రోహిత్ సేన. ఇటీవల న్యూజిలాండ్ చేతుల్లో సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్ అయింది. తాజాగా అడిలైడ్ టెస్ట్‌లో ఓటమిపాలైంది. దీంతో గంభీర్ కోచింగ్‌పై సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా టెస్టుల్లో అతడు జట్టును నడిపిస్తున్న తీరు, పన్నుతున్న వ్యూహాలు బెడిసికొడుతుండటంతో గౌతీ సామర్థ్యాన్ని చాలా మంది శంకిస్తున్నారు.
అదే కారణం
గంభీర్‌ను టెస్టుల నుంచి తీసేసి వన్డేలు, టీ20లకు కోచ్‌గా పరిమితం చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దిగ్గజ బ్యాటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను లాంగ్ ఫార్మాట్ కోచ్‌గా నియమించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ఎవర్నీ ఏమీ అనడానికి లేదు. సరిగ్గా గమనిస్తే తన మీద అభిమానులు, భారత క్రికెట్ బోర్డు పెట్టుకున్న నమ్మకాన్ని గంభీర్ నిలబెట్టుకోలేదనే చెప్పాలి. ఇచ్చిన అవకాశాల్ని సరిగ్గా వినియోగించుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. టీమ్ సెలెక్షన్ దగ్గర నుంచి స్ట్రాటజీ ప్లానింగ్ వరకు అతడు చేస్తున్న తప్పులే పీకల మీదకు తెచ్చాయని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
తప్పులు రిపీట్
పెర్త్ టెస్ట్‌లో ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్‌ను అడిలైడ్ టెస్ట్‌లో ఆడించలేదు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇలా ఎవర్ని ఎప్పుడు డ్రాప్ చేస్తున్నారో అర్థం కాక.. ప్లేయర్ల మనోస్థైర్యం దెబ్బతింటోందనే విమర్శలు వస్తున్నాయి. సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ సహా పలువురు ఆటగాళ్ల విషయంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో పదే పదే చేస్తున్న మార్పులు కూడా కాంట్రవర్సీకి దారితీసింది. ప్లేయర్లతో సరిగ్గా కమ్యూనికేట్ చేయడం లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇవన్నీ తొలగి తన టెన్యూర్ మొత్తం అతడు టీమిండియాను నడపాలంటే ఒకటే దారి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు రాబోయే అన్ని బిగ్ టోర్నమెంట్స్‌లో భారత్‌ను గెలిపించాలని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. గెలుపు బాట పడితే విమర్శలు వాటంతట అవే తగ్గుతాయని సూచిస్తున్నారు.
Also Read:
సెమీస్‌లో శ్రీకాంత్, గాయత్రి జోడీ
స్ట్రయికర్స్ జెర్సీ ఆవిష్కరణ
విడిపోయిన సింధు.. పార్క్ తే సంగ్
For Sports And Telugu News
Updated Date - Dec 09 , 2024 | 09:38 AM