IND vs AUS: రోహిత్ శర్మ ఊచకోత.. ఆస్ట్రేలియాకు భారీ లక్ష్యం
ABN, Publish Date - Jun 24 , 2024 | 10:02 PM
టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భాగంగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. రోహిత్ శర్మ..
టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భాగంగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో (41 బంతుల్లో 92 పరుగులు) ఊచకోత కోయడం వల్లే ఆస్ట్రేలియా ముందు భారత్ 206 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. అతనితో పాటు సూర్యకుమార్ (31), శివమ్ దూబే (28), హార్దిక్ పాండ్యా (27) కూడా మెరుగ్గా రాణించి.. జట్టుకి భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకి ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. భారత స్టార్ విరాట్ కోహ్లీ రెండో ఓవర్‌లో సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో.. టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ.. క్రీజులో ఇంకా నేనున్నానంటూ రోహిత్ తాండవం చేయడం మొదలుపెట్టాడు. ఎడాపెడా షాట్‌లతో ధ్వజమెత్తి.. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా.. అత్యంత డేంజరస్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో 29 పరుగులు చేయడం విశేషం. అతను వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ నాలుగు సిక్సులు, ఒక ఫోర్‌తో రప్ఫాడించేశాడు. ఈ దెబ్బకు 19 బంతులకే అర్థశతకం చేసి.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
ఆ తర్వాత కూడా రోహిత్ మరింత చెలరేగి ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. తాను మాత్రం ఒత్తిడికి గురవ్వకుండా దూకుడు ప్రదర్శించాడు. కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు చేశాడంటే.. రోహిత్ ఎలా దుమ్ముదులిపేశాడో మీరే అర్థం చేసుకోండి. ఈ క్రమంలోనే అతను సెంచరీ కూడా చేస్తాడని అనుకున్నారు కానీ.. దురదృష్టవశాత్తూ స్టార్క్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. లెగ్ సైట్ షాట్ కొట్టబోతే.. అది ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొని, ప్యాడ్‌కు తగిలి నేరుగా వికెట్లవైపుకు దూసుకెళ్లింది. దీంతో.. రోహిత్ క్రీజు వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు తమవంతు సత్తా చాటడంతో.. భారత్ 205/5 స్కోరు చేయగలిగింది. మరి.. దీనిని భారత బౌలర్లు డిఫెండ్ చేయగలరా?
Updated Date - Jun 24 , 2024 | 10:02 PM