ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs ENG: టీమిండియా ఖాతాలో చెత్త రికార్డు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా..

ABN, Publish Date - Jan 29 , 2024 | 01:16 PM

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ అధిక్యం లభించినప్పటికీ ఓటమి ఎదురుకావడం అభిమానులకు మింగుడుపడడం లేదు.

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ అధిక్యం లభించినప్పటికీ ఓటమి ఎదురుకావడం అభిమానులకు మింగుడుపడడం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై పూర్తిగా అధిపత్యం చెలాయించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్ విజయంలో ఓల్లీ పోప్, టామ్ హార్ట్‌లీ కీలకపాత్ర పోషించారు. ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో పోప్ 196 పరుగులతో చెలరేగాడు. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో హార్ట్‌లీ 7 వికెట్లతో మన జట్టు పతనాన్ని శాసించాడు. కాగా ఈ ఓటమితో భారత జట్టు ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో మొదటి ఇన్నింగ్స్‌లో 100+ పరుగుల అధిక్యం సాధించి కూడా టీమిండియా ఓటమి పాలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. విదేశాల్లో కూడా కలుపుకున్నా మూడోసారి మాత్రమే.


2015లో గాలె టెస్టులో శ్రీలంకపై మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 192 పరుగుల అధిక్యం సాధించింది. అయినప్పటికీ ఆ మ్యాచ్‌లో భారత జట్టు 63 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొత్తంగా 100 పరుగులకుపైగా అధిక్యం సాధించి ఓడిపోవడం టీమిండియాకు అదే మొదటిసారి. రెండోసారి 2022లో బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌‌తో జరిగిన టెస్టులో కూడా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 132 పరుగుల అధిక్యం సాధించింది. అయినప్పటికీ ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కాగా ఆదివారం ఇంగ్లండ్‌తో టీమిండియాకు ఎదురైన ఓటమి గత 12 ఏళ్లలో స్వదేశంలో మూడోది మాత్రమే. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా 100కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో వీరిద్దరు 100కుపైగా పరుగులు సమర్పించుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అలాగే టెస్టు క్రికెట్‌లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 29 , 2024 | 01:17 PM

Advertising
Advertising