ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs SA: రెండో టీ20లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు

ABN, Publish Date - Nov 11 , 2024 | 08:12 AM

సౌతాఫ్రికా సిరీస్‌ను విజయంతో ఆరంభించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో మాత్రం పరాజయం పాలైంది. ఫస్ట్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన టీమ్.. సెకండ్ టీ20లో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది.

సౌతాఫ్రికా సిరీస్‌ను విజయంతో ఆరంభించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో మాత్రం పరాజయం పాలైంది. ఫస్ట్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన టీమ్.. సెకండ్ టీ20లో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది ప్రొటీస్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూర్యసేన ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 7 వికెట్లకు 128 పరుగులు చేసింది. మరో ఓవర్ ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓటమికి గల 5 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


బ్యాటింగ్

తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ బలంతో సౌతాఫ్రికాను వణికించింది భారత్. కానీ రెండో మ్యాచ్‌లో మన బ్యాటర్లు తేలిపోయారు. జట్టు ప్రధాన బ్యాటర్లైన సంజూ శాంసన్ (0), అభిషేక్ శర్మ (4), సూర్యకుమార్ యాదవ్ (4), రింకూ సింగ్ (9) కనీసం రెండంకెల స్కోరు చేయలేదు. గత మ్యాచ్‌ హీరో సంజూ గోల్డెన్ డకౌట్‌ అవడం టీమ్‌ను దారుణంగా దెబ్బతీసింది. తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) మంచి స్టార్ట్స్ అందుకున్నాక వెనుదిరగడం భారీ స్కోరు ఆశలకు గండి పడేలా చేసింది. హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) రాణించినా మరో ఎండ్ నుంచి సహకారం లేకపోవడంతో వేగంగా పరుగులు చేయలేకపోయాడు.


బౌలింగ్

రెండో టీ20లో భారత బౌలర్లు బాగానే పెర్ఫార్మ్ చేశారు. ముఖ్యంగా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (5/17), రవి బిష్ణోయ్ (2/21) సూపర్బ్‌గా బౌలింగ్ చేశారు. ప్రొటీస్ బ్యాటర్లను వరుణ్ భయపెట్టాడు. వీళ్లిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేయడంతోనే మ్యాచ్ ఆఖరి వరకు వెళ్లింది. అయితే పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ వికెట్లు తీయకపోవడం, భారీగా పరుగులు సమర్పించుకోవడంతో స్కోరును కాపాడుకోలేకపోయింది భారత్.


సూర్యకుమార్ యాదవ్

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు సారథ్యంలోనూ ఫెయిలయ్యాడు. బ్యాటింగ్‌లో నాలుగు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగిన మిస్టర్ 360.. బౌలింగ్ టైమ్‌లో చేసిన పలు మార్పులు బెడిసికొట్టాయి. స్పిన్నర్లు 6 వికెట్లు తీసి మంచి జోరు మీద ఉన్నారు. అక్షప్ పటేల్ వికెట్ తీయకపోయినా ఒక ఓవర్ వేసి రెండు పరుగులే ఇచ్చాడు. అయినా అతడికి ఆఖర్లో బౌలింగ్ ఇవ్వలేదు సూర్య. అలాగే డీసెంట్‌గా బౌలింగ్ చేస్తున్న హార్దిక్‌ను కూడా డెత్‌లో బౌలింగ్‌కు దింపలేదు. ఇది జట్టుకు బిగ్ మైనస్‌గా మారింది. మ్యాచ్‌లో ఏడుగురు బ్యాటర్లతోనే వెళ్లడం కూడా కలసిరాలేదు. మరో స్పెషలిస్ట్ బ్యాటర్ ఉండి ఉంటే అదనంగా మరో 25 నుంచి 30 పరుగులు వచ్చేవి.


అర్ష్‌దీప్ సింగ్

పేసర్ అర్ష్‌దీప్ వైఫల్యం కూడా మ్యాచ్‌ భారత్ చేతుల్లో నుంచి జారిపోవడానికి ఓ కారణమనే చెప్పాలి. ఫస్ట్ స్పెల్‌లో వికెట్ తీయడమే గాక డీసెంట్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు అర్ష్‌దీప్. కానీ డెత్ ఓవర్లలో గెరాల్డ్ కొయెట్జీ లాంటి టెయిలెండర్‌ను ఆపలేకపోయాడు. వికెట్ తీయకపోవడమే గాక చివర్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడు ఒకట్రెండు ఓవర్లు కట్టడి చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది.


Also Read:

‘డబ్ల్యూటీఏ’ క్వీన్‌.. గాఫ్‌

ఉత్కంఠ పోరులో ముంబా గెలుపు

అదరగొట్టిన సాత్విక్‌ - చిరాగ్.. ఫైనల్స్ దూసుకెళ్లిన జోడీ

For More Sports And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 08:18 AM