IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టీ20.. భారత ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
ABN, Publish Date - Nov 07 , 2024 | 09:52 PM
న్యూజిలాండ్ సిరీస్ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీమిండియా మరో సిరీస్‌కు రెడీ అయిపోయింది. కుర్రాళ్లతో నిండిన భారత జట్టు.. బలమైన సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తలపడనుంది.
IND vs SA: న్యూజిలాండ్ సిరీస్ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీమిండియా మరో సిరీస్‌కు రెడీ అయిపోయింది. కుర్రాళ్లతో నిండిన భారత జట్టు.. బలమైన సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తలపడనుంది. నాలుగు టీ20ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ శుక్రవారం కింగ్స్‌మీడ్‌లో మొదలుకానుంది. ఫస్ట్ మ్యాచ్‌లో బోణీ కొట్టి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. పొట్టి ప్రపంచ కప్-2024 ఫైనల్ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని ప్రొటీస్ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
బోణీ కొట్టేందుకు సై
సౌతాఫ్రికాతో సిరీస్‌లో భారత్ కూడా బలమైన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. యువకులు, అనుభవజ్ఞులతో స్ట్రాంగ్ టీమ్‌ను సెట్ చేసింది. ఈ జట్టును సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ముందుండి నడిపించనున్నాడు. రేపటి మ్యాచ్‌లో యంగ్ గన్ అభిషేక్ శర్మకు తోడుగా స్టార్ కీపర్ సంజూ శాంసన్ మరో ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఖాయం. ఆ తర్వాత సారథి సూర్య, హైదరాబాదీ తిలక్ వర్మ బ్యాటింగ్‌కు దిగుతారు. సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మిడిలార్డర్ భారాన్ని మోయనున్నాడు. అతడితో పాటు చిచ్చరపిడుగు రింకూ సింగ్ కూడా ఓ చేయి వేస్తే జట్టుకు ఢోకా ఉండదు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ ఎలాగూ టీమ్‌లో ఉంటాడు.
బౌలింగ్ కూడా బలంగానే..
అక్షర్ టీమ్‌లో ఉంటే బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటం పక్కాగా కనిపిస్తోంది. ఇంక అర్ష్‌దీప్ సింగ్‌తో కలసి ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్ పేస్ బాధ్యతల్ని పంచుకునే అవకాశం ఉంది. మొత్తంగా జట్టు అన్ని విభాగాల్లోనూ బలమైన ఆటగాళ్లతో బరిలోకి దిగనుందని తెలుస్తోంది. దీంతో సౌతాఫ్రికాకు దబిడిదిబిడే అని చెప్పొచ్చుు.
భారత జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్.
Also Read:
కావాలనే సచిన్ కాళ్లు మొక్కించారు.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొత్త టీమ్‌తో కోహ్లీ.. ఇకపై అంతా వాళ్ల చేతుల్లోకి..
అయ్యర్ ఈజ్ బ్యాక్.. టీమిండియాలోకి రీఎంట్రీ
For More Sports And Telugu News
Updated Date - Nov 07 , 2024 | 09:56 PM