INDW vs SAW: ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో.. సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం
ABN, Publish Date - Jun 19 , 2024 | 09:04 PM
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా.. రెండో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. చివరి బంతి వరకూ..
స్వదేశంలో సౌతాఫ్రికాతో (South Africa Women) జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా.. రెండో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు (India Women) ఘనవిజయం సాధించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో.. 4 పరుగుల తేడాతో టీమిండియా విజయఢంకా మోగించింది. ప్లేయర్లందరూ సమిష్టిగా రాణించడం వల్లే.. ఈ విజయం భారత్ కైవసం అయ్యింది. ఈ గెలుపుతో వన్డే సిరీస్ భారత్ (2-0) కైవసం అయ్యింది.
Read Also: విరాట్ కోహ్లీ.. దయచేసి ఆ పని చేయకు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. తొలుత భారత జట్టు టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. స్మృతి మందాన (136), హర్మన్‌ప్రీత్ కౌర్ (103 నాటౌట్) శతక్కొట్టడం వల్లే.. భారత మహిళల జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో రిచా ఘోష్ (13 బంతుల్లో 25) మెరుపులు మెరిపించింది. అనంతరం 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మహిళల జట్టు.. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులకే పరిమితమైంది. దీంతో.. నాలుగు పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.
Read Also: ఆసుపత్రిలో ఇదేం పాడుపని.. డాక్టర్, నర్సు కలిసి..
సౌతాఫ్రికా ప్లేయర్లలో లారా వాల్వార్డ్ట్ (135 నాటౌట్), మరిజేన్ క్యాప్ (114) తమ జట్టుని గెలిపించుకోవడం కోసం గట్టిగానే ప్రయత్నించారు. భారత బౌలర్లను ముచ్చెమటలు పట్టించారు. ఒకానొక దశలో సౌతాఫ్రికాదే విజయమని అంతా భావించారు. చివర్లో 4 బంతులకే ఆరు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. సునాయాసంగా లక్ష్యాన్ని ఛేధిస్తారని భావించారు. కానీ.. భారత బౌలర్ పూజా వస్త్రాకర్ ఒక్కసారిగా మలుపు తిప్పేసింది. చివర్లో ఆమె రెండు వికెట్లు తీసింది. ఆ తర్వాత రెండు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి.. భారత జట్టుని విజయతీరాలకు చేర్చింది.
ఇరుజట్ల స్కోర్లు:
భారత్: 325/3 (50)
సౌతాఫ్రికా: 321/6 (50)
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 19 , 2024 | 09:04 PM