IPL 2024: లక్నోసూపర్ జెయింట్స్‌లో కీలక మార్పు.. స్టార్ ఆటగాడి స్థానంలో మరో బౌలర్!
ABN, Publish Date - Mar 30 , 2024 | 03:02 PM
ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా లక్నోసూపర్ జెయింట్స్ జట్టు శనివారం పంజాబ్ కింగ్స్‌తో (Lucknow Super Giants vs Punjab Kings) తలపడనుంది. టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్‌లో ఓడిన లక్నో.. పంజాబ్‌లో జరిగే మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది.
లక్నో: ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా లక్నోసూపర్ జెయింట్స్ జట్టు శనివారం పంజాబ్ కింగ్స్‌తో (Lucknow Super Giants vs Punjab Kings) తలపడనుంది. టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్‌లో ఓడిన లక్నో.. పంజాబ్‌లో జరిగే మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది. అయితే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు లక్నోసూపర్ జెయింట్స్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. ఈ సీజన్ మొత్తానికి దూరమైన ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లీ (David Willey) స్థానంలో న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీని(Matt Henry) లక్నో మేనేజ్‌మెంట్ తమ జట్టులో చేర్చుకుంది. ఈ మేరకు లక్నోసూపర్ జెయింట్స్ అధికారికంగా ప్రకటించింది. కాగా వ్యక్తిగత కారణాలతో డేవిడ్ విల్లీ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. వరుసగా ఐఎల్‌టీ20 లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడిన విల్లీ ఐపీఎల్ మొదటి అర్ధ భాగానికి దూరం కానున్నాడని లక్నోసూపర్ జెయింట్స్ ప్రధాన్ కోచ్ జస్టిన్ లాంగర్ గతంలో ధృవీకరించారు. కానీ ప్రస్తుతం విల్లీ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
కాగా గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత డేవిడ్ విల్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుంచి లీగ్ క్రికెట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. విల్లీ కంటే ముందే లక్నో జట్టుకే ప్రాతినిధ్యం వహించాల్సిన మరో ఇంగ్లండ్ పేసర్ మార్కు వుడ్ కూడా ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక విల్లీ స్థానంలో జట్టులోకి వచ్చిన హెన్రీ ఐపీఎల్‌లో గతంలో పంజాబ్ కింగ్స్, చెన్నైసూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఒక వికెట్ తీశాడు. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో విల్లీ సత్తా చాటాడు. గాయం కారణంగా టోర్నీ నుంచి మధ్యలోనే తప్పుకున్నప్పటికీ 7 మ్యాచ్‌లాడి 11 వికెట్లు తీశాడు. పాకిస్థాన్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో మళ్లీ జట్టులోకి వచ్చాడు. అలాగే స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో విల్లీ అదరగొట్టాడు. 4 టెస్టుల్లో 23 వికెట్లు తీశాడు. అందులో రెండు 5 వికెట్ల హాల్స్ కూడా ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు లక్నో జట్టులో కీలక మార్పు
SRH vs MI: ముంబై, సన్‌రైజర్స్ మ్యాచ్‌లో కావ్య మారన్ సెలబ్రేషన్స్ వైరల్.. ఫోకస్ మొత్తం ఆమెపైనే!
Updated Date - Mar 30 , 2024 | 04:53 PM