మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cricket: 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే అద్భుతం.. సరికొత్త రికార్డ్ నమోదు..!

ABN, Publish Date - Mar 09 , 2024 | 03:56 PM

James Anderson: ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌(ames Anderson) క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. 700 టెస్టు వికెట్లు తీసిన తొలి ఫాస్ట్‌ బౌలర్‌గా( నిలిచాడు. ధర్మశాలలో(Dharamsala) భారత్‌తో జరుగుతున్న 5వ టెస్టు 3వ రోజు సందర్భంగా కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడం ద్వారా 41 ఏళ్ల అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే

Cricket: 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే అద్భుతం.. సరికొత్త రికార్డ్ నమోదు..!
James Anderson

James Anderson: ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌(James Anderson) క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. 700 టెస్టు వికెట్లు తీసిన తొలి ఫాస్ట్‌ బౌలర్‌గా( నిలిచాడు. ధర్మశాలలో(Dharamsala) భారత్‌తో జరుగుతున్న 5వ టెస్టు 3వ రోజు సందర్భంగా కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడం ద్వారా 41 ఏళ్ల అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే 700, అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా ఆండర్సన్ నిలిచాడు. అండర్సన్ (700) కంటే ముందు ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) ఎక్కువ టెస్టు వికెట్లు తీశారు. అంతకు ముందు 2వ రోజు మ్యాచ్‌లో శుబ్‌మన్‌గిల్‌ను ఔట్ చేయడం ద్వారా అండర్సన్ 699 వికెట్లకు చేరుకున్నాడు.

కాగా, 1877 నుంచి ప్రారంభమైన 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అండర్సన్ 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా నిలిచాడు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అండర్సన్ 16 ఓవర్లలో 2/60 ఇచ్చాడు. శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్‌ల వికెట్లు తీశాడు.

ఇదికూడా చదవండి: వందో టెస్టులో తిప్పేసిన అశ్విన్.. ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ చిత్తు

2002లో ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అండర్సన్ ఇప్పుడు 187 టెస్టుల్లో 700 వికెట్లు పడగొట్టాడు. 26.52 సగటు, 56.9 స్ట్రైక్ రేట్‌ ఉంది. అండర్సన్ పేరు మీద 32 సార్లు 5 వికెట్లు పడగొట్టాడుర. మూడుసార్లు 10 వికెట్లు పడగొట్టిన చరిత్ర ఉంది. ఒక ఇన్నింగ్స్‌లో అండర్సన్ అత్యుత్తమ బౌలింగ్ 7/42. అంతేకాదు.. ఇంగ్లండ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌‌గానూ అండర్సన్ నిలిచాడు. మొత్తంమీద అంతర్జాతీయ క్రికెట్‌లో అండర్సన్.. శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ (133 మ్యాచ్‌లలో 800 వికెట్లు), దివంగత ఆస్ట్రేలియా స్పిన్ గ్రేట్ షేన్ వార్న్ (145 మ్యాచ్‌లలో 708 వికెట్లు) తరువాత నిలిచాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2024 | 03:56 PM

Advertising
Advertising