ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jasprit Bumrah: బుమ్రా స్టన్నింగ్ డెలివరీ.. బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్

ABN, Publish Date - Dec 18 , 2024 | 11:35 AM

Jasprit Bumrah: : టీమిండియా ఏస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మామూలుగానే బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. ఇంక వికెట్ తీయాలని డిసైడ్ అయితే వాళ్లకు నరకం చూపించడం ఖాయం. అది మరోమారు ప్రూవ్ అయింది.

Jasprit Bumrah

IND vs AUS: భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా మామూలుగానే భీకరంగా బౌలింగ్ చేస్తాడు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. బంతని టచ్ చేయాలన్నా భయపడేలా చేస్తాడు. అలాంటోడు వికెట్ తీయాలని ఫిక్స్ అయితే ఇంకెలా బౌలింగ్ చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. గబ్బా టెస్ట్‌ థర్డ్ ఇన్నింగ్స్‌లో ఇదే జరిగింది. ఆసీస్‌ బెండు తీయాలని డిసైడ్ అయిన బుమ్రా.. ఆ జట్టు బ్యాటర్లతో ఆడుకున్నాడు. ఒకదాన్ని మించి మరో బంతి విసురుతూ వికెట్ల పండుగ చేసుకున్నాడు. అయితే అన్నింటా ఆ వికెట్ మాత్రం స్పెషల్ అనే చెప్పాలి.


పర్ఫెక్ట్ డెలివరీతో..

మూడో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు బుమ్రా. ఓపెనర్‌ ఉస్మాన్ ఖవాజా (8)తో పాటు స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (1), ప్యాట్ కమిన్స్ (22)ను అతడు పెవిలియన్‌కు పంపించాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో అతడు 9 వికెట్లు పడగొట్టాడు. అయితే అన్ని వికెట్ల కంటే కూడా ఖవాజాను అతడు బలిగొన్న విధానం హైలైట్ అనే చెప్పాలి. స్టన్నింగ్ డెలివరీతో అతడ్ని బిత్తరపోయేలా చేశాడు భారత్ పేసర్. పర్ఫెక్ట్ లెంగ్త్‌లో పిచ్ అయిన డెలివరీ ఆఫ్ సైడ్ యాంగిల్ తీసుకొని లోపలకు దూసుకొచ్చింది.


రెప్పపాటులోనే..

బుమ్రా వేసిన ఆ చక్కటి డెలివరీని స్ట్రయిట్ బౌండరీకి పంపించాలని ఖవాజా భావించాడు. అయితే అతడు షాట్ కొట్టేలోపు దూసుకొచ్చిన బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వెళ్లి వికెట్లను ముద్దాడింది. బాల్ తగిలిన వేగానికి స్టంప్స్ ఎగిరి చాలా దూరంలో పడ్డాయి. ఏం జరిగిందో తెలియక ఖవాజా షాక్‌లో ఉండిపోయాడు. ఇది చూసిన నెటిజన్స్.. వావ్ వాటే బాల్ అని అంటున్నారు. ఇది బుమ్రా స్పెషల్ డెలివరీ అని చెబుతున్నారు. పిచ్‌ మీద ఏ ప్లేస్‌లో బంతిని వేసినా వికెట్లు ఎగిరేలా చేయడం అతడికే సాధ్యమని కామెంట్స్ చేస్తున్నారు. బుమ్రా.. నీ జోరు ఇలాగే కొనసాగించు అని ప్రశంసిస్తున్నారు.


Also Read:

రివేంజ్ తీర్చుకున్న సిరాజ్.. మియా పగబడితే ఇలాగే ఉంటది

కెరీర్ క్లోజ్.. రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చేసిన రోహిత్..

చెప్పాడు.. చేశాడు.. మాట నిలబెట్టుకున్న బుమ్రా

దేవుడా.. ఇంకెన్ని చేయాలి!

For More Sports And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 11:37 AM