Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన బుమ్రా.. పేసుగుర్రం ఆల్‌టైమ్ రికార్డ్
ABN, Publish Date - Dec 15 , 2024 | 01:22 PM
Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. గబ్బా టెస్ట్‌లో అరుదైన ఫీట్‌ను అతడు అందుకున్నాడు. ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేశాడు.
IND vs AUS: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు రికార్డులు కొత్తేమీ కాదు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక రికార్డుకు పాతర వేయడం అతడు అలవాటు చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతమైన ఆటతీరుతో తోపు బౌలర్‌గా పేరు తెచ్చుకున్న బుమ్రా.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. ఓవర్సీస్‌లో టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్ హాల్ సాధించిన బౌలర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు.
ఒక్క స్పెల్.. బోలెడు రికార్డులు
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో అదరగొట్టాడు బుమ్రా. ఉస్మాన్ ఖవాజా (21), నాథన్ మెక్‌స్వీనీ (9), స్టీవ్ స్మిత్ (101)తో పాటు ట్రావిస్ హెడ్ (152), మిచెల్ మార్ష్ (5)ను పెవిలియన్‌కు పంపించాడు బుమ్రా. మార్ష్ వికెట్‌తో ఫైవ్ వికెట్ హాల్ పూర్తి చేసుకున్నాడు. సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) కంట్రీస్‌పై లాంగ్ ఫార్మాట్‌లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అతడు ఫస్ట్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఈ లిస్ట్‌లో బుమ్రా (8 సార్లు) తర్వాతి స్థానంలో లెజెండ్ కపిల్‌దేవ్ (7) ఉన్నాడు. భారత తరఫున టెస్టుల్లో మోస్ట్ ఫైఫర్స్ తీసిన బౌలర్లలో కపిల్‌దేవ్ (23 సార్లు) తర్వాత ప్లేస్‌లో నిలిచాడు బుమ్రా (12 సార్లు). ఇలా ఒకే స్పెల్‌తో పలు రికార్డులకు అతడు పాతర వేశాడు.
Also Read:
రోహిత్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన స్టీవ్ స్మిత్
గబ్బాలో సచిన్ కూతురు.. అతడి కోసం స్పెషల్‌గా..
ఆ గొడవ మర్చిపోని సిరాజ్
For More Sports And Telugu News
Updated Date - Dec 15 , 2024 | 01:22 PM