Bumrah vs Head: బుమ్రా దెబ్బకు హెడ్‌కు మైండ్‌బ్లాంక్.. ఇది చూసి తీరాల్సిన వికెట్
ABN, Publish Date - Dec 26 , 2024 | 06:39 PM
Boxing Day Test: పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా తనను ఎందుకు టాప్ బౌలర్ అని పిలుస్తారో మరోమారు ప్రూవ్ చేశాడు. తోపు బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు అతడు వేసిన స్టన్నింగ్ డెలివరీ చూస్తే ఎవ్వరికైనా మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే.
IND vs AUS: పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ అంటే ప్రత్యర్థులు జడుసుకుంటారు. అతడితో ఎందుకు వచ్చిన తంటా అని భయపడతారు. బుమ్రా బౌలింగ్‌లో పరుగులు రాకపోయినా ఫర్వాలేదు.. వికెట్ కాపాడుకుంటే అదే పదివేలు అని భావిస్తారు. బుమ్రా కూడా అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు స్టన్నింగ్ బౌలింగ్‌తో తన పేరు నిలబెట్టుకుంటున్నాడు. తనను ఎందుకు టాప్ బౌలర్ అని పిలుస్తారో అతడు మరోమారు ప్రూవ్ చేశాడు. తోపు బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు అతడు వేసిన స్టన్నింగ్ డెలివరీ చూస్తే ఎవ్వరికైనా మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే. బాక్సింగ్ డే టెస్ట్ ఆసీస్ ఇన్నింగ్స్‌లో బుమ్రా మాయ చేశాడు. అద్భుతమైన ఇన్ స్వింగర్‌తో హెడ్‌ను పెవిలియన్‌కు పంపించాడు.
క్లీన్ బౌల్డ్‌తో..
మెల్‌బోర్న్ టెస్ట్ తొలి రోజు మొదటి రెండు సెషన్లు బుమ్రా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కొత్త కుర్రాడు శామ్ కోన్స్టాస్ (65 బంతుల్లో 60) భారత పేసర్‌ను అటాక్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో కోన్స్టాస్ భారీగా పరుగులు పిండుకున్నాడు. అతడు వేసిన ఓ ఓవర్‌లోనైతే ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. సెకండ్ స్పెల్‌లోనూ పేసుగుర్రం మ్యాజిక్ నడవలేదు. అయితే ఆఖరి సెషన్‌లో బుమ్రా చెలరేగిపోయాడు. తాను ఏంటో చూపించాడు. నిప్పులు చెరిగే బంతులతో కంగారూ బ్యాటర్లతో ఆడుకున్నాడు. వరుస మెయిడిన్లు వేస్తూ హడలెత్తించాడు. హెడ్‌తో పాటు మిచెల్ మార్ష్‌ను ఔట్ చేశాడు. హెడ్‌ను అతడు క్లీన్ బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
వాటే బాల్..
అప్పుడప్పుడే క్రీజులోకి వచ్చిన హెడ్‌ను నిఖార్సయిన పేస్‌తో గుక్కతిప్పుకోకుండా చేశాడు బుమ్రా. బంతిని టచ్ చేయాలా? వద్దాలా? అనే మీమాంసలో పడేశాడు. దీంతో టచ్ చేస్తే వికెట్ పోతుందని ఆలోచనల్లో పడ్డ హెడ్ వికెట్ సమర్పించుకున్నాడు. బుమ్రా ఫుల్లర్ లెంగ్త్‌లో వేసిన బంతిని విడిచిపెట్టి మూల్యం చెల్లించుకున్నాడు. పిచ్ మీద పడిన బంతి స్వింగై అనూహ్యంగా లోపలకు దూసుకొచ్చింది. హెడ్ తేరుకునేలోపే బెయిల్స్ ఎగిరి దూరంగా పడ్డాయి. వికెట్ తీసిన బుమ్రా.. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అంటూ పోజిచ్చాడు. ఔటైన హెడ్.. ఏం బౌలింగ్ రా బాబు, ఎలా ఆడతారు? అంటూ తల వంచుకొని వెళ్లిపోయాడు. ఈ వికెట్ చూసిన నెటిజన్స్.. క్లీన్‌బౌల్డ్ చేయడం అనేది ఒక ఆర్ట్ అయితే.. అందులో బుమ్రా ఆర్టిస్ట్ అంటూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
Also Read:
అందర్నీ భయపెట్టే బుమ్రానే వణికించాడు.. ఎవరీ కోన్స్టాస్..
జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్.. గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా అంటూ..
తగలరాని చోట తగిలిన బంతి.. స్మిత్ రియాక్షన్ వైరల్
సస్పెన్షన్ సమయంలో టోర్నీలు ఎలా ఆడింది?
For More Sports And Telugu News
Updated Date - Dec 26 , 2024 | 06:44 PM