ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jasprit Bumrah: బుమ్రా పగబడితే ఇట్లుంటది.. బెయిల్స్ వెతకడానికి టైమ్ సరిపోదు..

ABN, Publish Date - Dec 29 , 2024 | 02:00 PM

IND vs AUS: పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా సరదా సరదాకే వికెట్లు తీస్తుంటాడు. ఇంక అతడు గానీ పగబడితే అస్సలు ఊరుకోడు. వెంటపడి మరీ ప్రత్యర్థుల తాట తీస్తాడు. వాళ్ల అంతు చూసే దాకా వదలడు.

Jasprit Bumrah

Boxing Day Test: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా సరదా సరదాకే ప్రత్యర్థి బ్యాటర్లకు పోయిస్తుంటాడు. వచ్చిన బ్యాటర్‌ను వచ్చినట్లు పెవిలియన్‌కు పంపిస్తుంటాడు. పదునైన యార్కర్లు, ఒళ్లు గగుర్పొడిచే బౌన్సర్లు, రాకాసి స్వింగర్లతో అపోజిషన్ టీమ్స్‌ను వణికిస్తుంటాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోలేక తోపు బ్యాటర్లు తోకముడిచిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అలాంటి సిసలైన స్పీడ్‌స్టర్ ఇంక పగబడితే ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. అతడితో పెట్టుకున్న బ్యాటర్‌కు నిద్రలేని రాత్రులు గ్యారెంటీ అనే చెప్పాలి. ఆస్ట్రేలియా యంగ్ ఓపెనర్ సామ్ కోన్స్టాస్ విషయంలో అదే జరిగింది. అతడిపై ప్రతీకారం తీర్చుకున్నాడు బుమ్రా. అసలు ఏం జరిగింది? ఏంటీ రివేంజ్ స్టోరీ అనేది ఇప్పుడు చూద్దాం..


కోహ్లీనీ రెచ్చగొట్టాడు..

బాక్సింగ్ డే టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకపడ్డాడు కంగారూ కొత్త కుర్రాడు కోన్స్టాస్. అతడు వేసిన ఒకే ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. రివర్స్ స్వీప్, ర్యాంప్ షాట్లతో అటాక్ చేసి బుమ్రాను కంగారుపెట్టాడు. అక్కడితో ఊరుకోలేదు. భారత ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీని ఔట్ చేయగానే.. కమాన్.. అంటూ చప్పట్లతో ఆసీస్ అభిమానులను అతడు ఉత్సాహపరిచాడు. అప్పటికే పగతో రగిలిపోతున్న బుమ్రా.. కోహ్లీని అవమానించడాన్ని అస్సలు తట్టుకోలేకపోయాడు. దీన్ని మనసులో ఉంచుకొని ఆతిథ్య జట్టు సెకండ్ ఇన్నింగ్స్‌ సమయంలో చెలరేగాడు. కోన్స్టాస్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి పగ తీర్చుకున్నాడు.


ప్రతీకారం పరిపూర్ణం

ఔట్ స్వింగర్లు వేస్తూ కోన్స్టాస్‌ను సెట్ చేసిన బుమ్రా.. ఆ తర్వాత ఒక్కసారిగా బంతిని లోపలి వైపునకు స్వింగ్ చేశాడు. డెక్‌లో పడి కట్ అయిన బంతిని ఫ్రంట్ ఫుట్ మీదే డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు ఆసీస్ ఓపెనర్. కానీ అతడి బ్యాట్‌ను దాటుకొని వెళ్లిన బంతి వికెట్లను చెల్లాచెదురు చేసింది. బంతి తాకిన వేగానికి బెయిల్స్ ఎగిరి చాలా దూరంలో పడ్డాయి. రెప్పపాటులో దూసుకొచ్చిన బంతి బుల్లెట్ స్పీడ్‌తో వికెట్లను పడేయడంతో కోన్స్టాస్‌ బిత్తరపోయాడు. వికెట్ పడ్డాక ఆసీస్ ఆడియెన్స్‌ను కమాన్.. ఇప్పుడు అరవండి చూద్దామంటూ తన రివేంజ్ తీర్చుకున్నాడు బుమ్రా. తనతో పాటు కోహ్లీ ప్రతీకారాన్ని కూడా అతడు కంప్లీట్ చేశాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్స్ బుమ్రాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని.. అతడు పగబడితే ఎంతటి బ్యాటర్‌నైనా పడగొట్టక వదలడని, అంతు చూస్తాడని హెచ్చరిస్తున్నారు.


Also Read:

కపిల్ దేవ్ రికార్డ్ చిత్తు చేసిన బుమ్రా.. మరో ఘనత కూడా..

ప్రపంచ వేదికపై సత్తాచాటిన కోనేరు హంపి..

కొడుకు తొలి శతకం తండ్రి భావోద్వేగం అమ్మతో..

For More Sports And Telugu News

Updated Date - Dec 29 , 2024 | 02:04 PM