ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs AUS: ఆసీస్ కాదు.. ఆ ఒక్కడికి భయపడుతున్న భారత్.. గబ్బాకు వస్తున్నాడు

ABN, Publish Date - Dec 12 , 2024 | 01:58 PM

గబ్బా ఫైట్‌కు సమయం దగ్గర పడుతోంది. డిసెంబర్ 14వ తేదీన ఆతిథ్య ఆస్ట్రేలియా, పర్యాటక టీమిండియా ప్రఖ్యాత స్టేడియంలో తాడోపేడో తేల్చుకోనున్నాయి. సిరీస్‌లోని చాలా కీలక మ్యాచ్‌గా ఇది మారబోతోంది.

IND vs AUS: గబ్బా ఫైట్‌కు సమయం దగ్గర పడుతోంది. డిసెంబర్ 14వ తేదీన ఆతిథ్య ఆస్ట్రేలియా, పర్యాటక టీమిండియా ప్రఖ్యాత స్టేడియంలో తాడోపేడో తేల్చుకోనున్నాయి. సిరీస్‌లోని చాలా కీలక మ్యాచ్‌గా ఇది మారబోతోంది. అడిలైడ్ టెస్ట్‌లో గ్రాండ్ విక్టరీతో జోరు మీదున్న ఆసీస్ మళ్లీ విజయఢంకా మోగించాలని చూస్తోంది. గెలుపుతో రోహిత్ సేన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి ట్రోఫీని కబ్జా చేయాలని చూస్తోంది. మరోవైపు పెర్త్ టెస్ట్ విక్టరీని కంటిన్యూ చేయలేకపోవడం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ బెర్త్ ఇరకాటంలో పడటంతో టీమిండియా గబ్బాలో చావోరేవో తేల్చుకోవాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌ కంటే కూడా ఒకడ్ని చూసి భారత జట్టు ఎక్కువ టెన్షన్ పడుతోంది. అతడెవరో ఇప్పుడు చూద్దాం..


సీనియర్లకు దడ

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొత్త ఛైర్మన్ జైషా ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. గబ్బా టెస్ట్‌ను లైవ్‌లో చూసేందుకు అతడు అక్కడికి వెళ్తున్నాడు. మైదానంలో భారత్-ఆసీస్ కొదమసింహాల్లా కొట్లాడుతుంటే చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌‌ను చూడటంతో పాటు మరో మీటింగ్‌కు అటెండ్ అవనున్నాడు షా. సమ్మర్ ఒలింపిక్స్-2032కు బ్రిస్బేన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ ఎడిషన్‌లో క్రికెట్‌ కూడా విశ్వక్రీడల్లో భాగం కానుంది. దీనికి సంబంధించిన కొన్ని కీలక సమావేశాల్లో షా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే షా రాక టీమిండియా సీనియర్లలో దడ పుట్టిస్తోందని సమాచారం.


ఫెయిలైతే ఇక అంతే

కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఈమధ్య టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్నారు. దీంతో వాళ్లను తీసేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో వీళ్ల ఫిట్‌నెస్, గేమ్‌ను దగ్గర నుంచి గమనించేందుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు. మూడో టెస్ట్‌లో వీళ్ల ఆటను చూసేందుకు ఇప్పుడు షా వస్తున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో గనుక ఫెయిలైతే గనుక వారిలో కనీసం ఇద్దరు క్రికెటర్ల రిటైర్మెంట్ ఖాయమనే పుకార్లు వస్తున్నాయి. ఆ ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ విషయంలో ఆల్రెడీ బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారని.. ఒకవేళ షా ముందు అలాగే ఆడితే వారిని ఎవరూ కాపాడలేరనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, బీసీసీఐ సెక్రెటరీ పోస్ట్ నుంచి తప్పుకున్న షా.. డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. భారత క్రికెట్‌తో అతడికి నేరుగా సంబంధం లేకపోయినా షా కనుసన్నల్లోనే బోర్డు నడుస్తుంది కాబట్టి పైసీనియర్ల కెరీర్ అతడి చేతుల్లోనే ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read:

43వ పడిలోకి యువరాజ్.. డాషింగ్ ఆల్‌రౌండర్ లైఫ్‌లోని 7 డార్క్ సీక్రెట్స్
దిగజారిన కోహ్లీ, రోహిత్‌ ర్యాంకులు

గాయత్రి జోడీకి నిరాశ

టీఓఏ పీఠంపై జితేందర్‌
For More
Sports And Telugu News

Updated Date - Dec 12 , 2024 | 02:04 PM