ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 Auction: నిరీక్షణకు తెర.. ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది

ABN, Publish Date - Nov 05 , 2024 | 09:58 PM

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు సంబంధించిన అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. వేలం జరిగే వేదిక, తేదీతో పాటు ఇతర వివరాలపై అప్‌‌డేట్ వచ్చేసింది.

IPL Mega Auction: ఐపీఎల్ 18వ సీజన్‌కు సంబంధించిన మెగా ఆక్షన్ మీద అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. వేలం నిర్వహణ, తేదీలు, వేదిక ఎక్కడనేది తెలుసుకోవాలని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిటెన్షన్ ప్రక్రియ ముగిసినప్పటి నుంచి దీనిపై నిరీక్షణ కొనసాగుతోంది. అయితే ఎట్టకేలకు క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఐపీఎల్ మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనేది తేలిపోయింది. ఈసారి సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆక్షన్‌ నిర్వహించనున్నారు.


జెడ్డా ఫిక్స్

ముందుగా అనుకున్నట్లుగానే నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. వేదికగా జెడ్డా ఖరారైంది. సౌదీ రాజధాని రియాద్‌లో వేలం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా చేసిన అధికారిక ప్రటకనలో జెడ్డాలో వేలం నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. ఈసారి ఆక్షన్‌లో ఎంత మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు అనేది కూడా క్లారిటీ ఇచ్చింది.


స్లాట్స్ తక్కువే..

ఈసారి మొత్తంగా 1,574 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1,224 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు పాల్గొననున్నట్లు తెలిపింది. అసోసియేట్ దేశాలకు చెందిన మరో 30 మంది క్రికెటర్లు కూడా ఆక్షన్‌లో పాల్గొంటున్నట్లు పేర్కొంది. అయితే ఇంత భారీగా ఆటగాళ్లు పోటీపడుతున్నా కేవలం 204 మంది మాత్రమే అమ్ముడుపోయే వీలుందని.. ఆ మేరకే స్లాట్స్ ఉన్నట్లు వివరించింది.


Also Read:

భారత్‌లో ఒలింపిక్స్.. ఏళ్ల కల సాకారం

కోహ్లీ బయోపిక్‌లో రామ్ చరణ్.. ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్

మూలాలు మరిస్తే ఎలా..!

For More Sports And Telugu News

Updated Date - Nov 05 , 2024 | 10:03 PM