Kagiso Rabada: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా పేసర్ రబాడ
ABN, Publish Date - Oct 21 , 2024 | 02:39 PM
ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించే దక్షిణాఫ్రికా స్పీడ్ స్టర్ కగిసో రబాడ సంచలన రికార్డును సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 3 వికెట్లు తీయడం ద్వారా బంతుల పరంగా అత్యంత వేగంగా 300 టెస్టు వికెట్లు అందుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ బౌలర్లను అతడు అధిగమించాడు.
దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ సంచలన రికార్డు సృష్టించాడు. బంతుల పరంగా టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడిగా అవతరించాడు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఈ రికార్డును నెలకొల్పాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య బంగ్లాదేశ్‌కు రబాడతో పాటు మిగతా దక్షిణాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు. ఆరంభంలో పిచ్‌పై లభించిన బౌన్స్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. కేవలం 106 పరుగులకే బంగ్లాను ఆలౌట్ చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లలో ముల్డర్, మహరాజ్ చెరో 3 వికెట్లు, డీ పెడ్ 1 చొప్పున వికెట్లు తీశారు.
కాగా బంగ్లాదేశ్‌పై మూడు వికెట్లు తీయడంతో 300 వికెట్ల క్లబ్‌లో రబాడ అడుగుపెట్టాడు. ప్రపంచ బౌలర్లు అందరి కంటే అతి తక్కువగా 11,817 బంతుల్లోనే రబాడ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజాలైన వకార్ యూనిస్, డేల్ స్టెయిన్, అలెన్ డొనాల్డ్, మాల్కోమ్ మార్షల్‌లను రబాడ అధిగమించాడు.
బంతుల పరంగా వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే..
1. కగిసో రబాడ (దక్షిణాఫ్రికా) - 11,817 బంతులు
2. వకార్ యూనిస్ (పాకిస్థాన్) - 12,602 బంతులు
3. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) - 12,605 బంతులు
4. అలెన్ డొనాల్డ్ (దక్షిణాఫ్రికా) - 13,672 బంతులు
రబాడ కంటే ముందు పాకిస్థాన్ క్రికెట్ వకార్ యూనిస్ అగ్రస్థానంలో ఉండేవాడు. కానీ యూనిస్ కంటే దాదాపు 800 బంతులు ముందుగానే ఈ రికార్డును రబాడ చేరుకున్నాడు. దీంతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఇవి కూడా చదవండి
కివీస్ తో రెండో టెస్టు.. టెన్షన్ పెడుతున్న రిషభ్ పంత్
For more Sports News and Telugu News
Updated Date - Oct 21 , 2024 | 02:44 PM