మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SRH vs MI: ముంబై, సన్‌రైజర్స్ మ్యాచ్‌లో కావ్య మారన్ సెలబ్రేషన్స్ వైరల్.. ఫోకస్ మొత్తం ఆమెపైనే!

ABN, Publish Date - Mar 28 , 2024 | 02:12 PM

కావ్యా మారన్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమానిగా అందరికి సుపరిచితమే. యజమానిగా తన జట్టును ప్రోత్సాహించడంలో కావ్య ఎప్పుడూ ముందుంటుంది. దాదాపుగా సన్‌రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరవుతుంటుంది.

SRH vs MI: ముంబై, సన్‌రైజర్స్ మ్యాచ్‌లో కావ్య మారన్ సెలబ్రేషన్స్ వైరల్.. ఫోకస్ మొత్తం ఆమెపైనే!

కావ్య మారన్(Kavya Maran). ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐపీఎల్(IPL 2024) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమానిగా అందరికి సుపరిచితమే. యజమానిగా తన జట్టును ప్రోత్సాహించడంలో కావ్య ఎప్పుడూ ముందుంటుంది. దాదాపుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరవుతుంటుంది. ఆటగాళ్లను ఎంకరేంజ్ చేస్తుంది. తన అందంతోపాటు మంచి మనసుతో అభిమానులనే కాకుండా క్రికెట్ ప్రేమికులను కూడా ఆకట్టుకుంటుంది. మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు బౌండరీలు బాదినప్పుడు, వికెట్లు తీసినప్పుడు సంబరాలు చేసుకుంటుంది. అలా కాకుండా ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు మోహం దిగాలుగా పెడుతుంది. దీంతో మ్యాచ్‌ను కవరేజ్ చేసే కెమెరామెన్లు కావ్యా మారన్‌పై ప్రత్యేక దృష్టి పెడతారు. ఆమె హవాభావాలను నిత్యం రికార్డు చేస్తుంటారు. కావ్య స్క్రీన్‌పై కనిపించినప్పుడల్లా అభిమానులు ఆనందంతో కేరింతలు కొడతారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్(Sunrisers Hyderabad vs Mumbai Indians) ఆడిన మ్యాచ్‌కు కూడా కావ్య హాజరైంది.


భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 31 పరుగుల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు వీర బాదుడు బాదుతుంటే, వికెట్లు తీస్తుంటే కావ్యా మారన్ చేసుకున్న సంబరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కావ్య సంబరాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమదైన స్థాయిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సన్‌రైజర్స్ మ్యాచ్ గెలిచాక.. ప్రస్తుతం ఈ ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉన్న మహిళ కావ్యా మారన్ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అలాగే రోహిత్ శర్మ ఔటయ్యాక కావ్యా మారన్ సంబరాలు చేసుకున్న ఫోటోను మరో నెటిజన్ నెట్టింట పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఈ సారి కప్ గెలిచి కావ్యా మారన్‌కు అంకింతం ఇవ్వాలని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్ ఆటగాళ్లు అదరగొట్టాలని కావ్య మారన్ ఈ సీజన్ మొత్తం నవ్వుతూ ఉండాలని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. సన్‌రైజర్స్ విజయం అనంతరం కావ్యా మారన్ ఎగిరి గంతేసిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: సరికొత్త రికార్డు నెలకొల్పిన సన్‌రైజర్స్ బౌలర్.. మనీష్ పాండేను అధిగమించి మరి..

SRH vs MI: ముంబై బౌలర్లను ఉతికారేసిన తండ్రి.. ఈ చిట్టి తల్లి ఎంకరేజ్‌మెంట్‌కు అంతా ఫిదా!

Updated Date - Mar 28 , 2024 | 03:21 PM

Advertising
Advertising