Team India: ఈ స్టార్ క్రికెటర్‌ను గుర్తుపట్టారా.. బరిలోకి దిగితే బౌలర్లకు బడితపూజే
ABN, Publish Date - Nov 18 , 2024 | 07:21 PM
Team India: టీమిండియా స్టార్లకు సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకోవాలని ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే వాళ్ల కోసం అటు ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విశేషాలను కూడా క్రికెటర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
IND vs AUS: క్రికెట్‌ను మతంగా చూసే మన దేశంలో.. ఆటగాళ్లను డెమీ గాడ్స్‌గా ఆరాధిస్తుంటారు. టీమిండియా స్టార్లకు సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకోవాలని ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ప్లేయర్లు కూడా అభిమానులకు అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా వారిని కలిసేందుకు ప్రయత్నిస్తారు. ఎంత బిజీగా ఉన్నా ఫ్యాన్స్ అడిగితే సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చేందుకు వెనుకాడరు. అదే సమయంలో వాళ్ల కోసం తమ ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విశేషాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు క్రికెటర్లు. ఓ భారత స్టార్ ఇలాగే ఇప్పుడో హాట్ ఫొటోను నెట్టింట అభిమానులతో పంచుకున్నాడు. అతడు ఎవరో తెలుసా?
ఒంటినిండా టాటూలతో..
ఒక టీమిండియా స్టార్ షర్ట్ లెస్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షార్ట్ వేసుకొని బీచ్‌లో సేదదీరుతున్నాడా ప్లేయర్. అతడి వీపు, ఎడమ చేతి మీద భారీగా టాటూలు ఉన్నాయి. యంగ్ క్రికెటర్స్ మాదిరిగా షార్ట్ హెయిర్ కట్ కాకుండా లాంగ్ హెయిర్‌లో అతడు దర్శనమిచ్చాడు. వెనుక నుంచి దిగిన ఈ ఫొటోలో ఆ ప్లేయర్ ముఖం కొద్దిగా మాత్రమే కనిపిస్తోంది. దీంతో ఎవరు అతడు అనే క్యూరియాసిటీ ఆడియెన్స్‌లో పెరిగిపోయింది. అతడు మరెవరో కాదు.. స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఆస్ట్రేలియా పెర్త్ నగరంలోని బీచ్ ఒడ్డున దిగిన ఫొటోను అందరితో పంచుకున్నాడు రాహుల్.
పెర్త్ ఛాలెంజ్‌కు రెడీ
రాహుల్ షర్ట్‌లెస్ ఫొటోలు చూసిన నెటిజన్స్ వావ్.. సూపర్ అంటున్నారు. టాటూలు అదిరిపోయాయని చెబుతున్నారు. అతడి జులపాల జుట్టు, బాడీ, టాటూలు చూస్తుంటే టాలీవుడ్ స్టార్‌లా కనిపిస్తున్నాడని మెచ్చుకుంటున్నారు. కాగా, ఆసీస్‌తో తొలి టెస్టులో రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కొడుకు పుట్టడంతో ఫస్ట్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదు. దీంతో అతడి స్థానంలో రాహుల్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయడం పక్కా అని తెలుస్తోంది. అయితే ఫామ్‌లేమితో సతమతమవుతున్న రాహుల్ ఎంతమేర రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అతడు ఫెయిలైతే మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం అసాధ్యంగా కనిపిస్తోంది. మరి.. రాహుల్ ఏం చేస్తాడో చూడాలి.
Also Read:
గంభీర్‌ను దింపేసేందుకు ఆసీస్ కుట్ర.. గట్టిగానే ప్లాన్ చేశారు
కొకైన్ తీసుకుని మ్యాచ్ ఆడి.. అడ్డంగా బుక్కైన క్రికెటర్..
స్టొయినిస్ మెరుపు ఇన్నింగ్స్.. పాక్ బౌలర్లకు నరకం చూపించాడు
For More Sports And Telugu News
Updated Date - Nov 18 , 2024 | 07:29 PM